pizza
Prema Bhiksha shoot in Kolar, Karnataka
కోలార్ లో షూటింగ్ జరుపుకుంటున్న ప్రేమభిక్ష
You are at idlebrain.com > news today >
Follow Us

24 October 2016
Hyderaba
d

శ్రీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో అనిల్‌, శృతిలయ హీరోహీరోయిన్‌లుగా, ఎం. ఎన్‌. బైరారెడ్డి, నాగరాజు నిర్మాతలుగా, ఆర్‌.కె. గాంధీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'ప్రేమభిక్ష'. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి న షూటింగ్ కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ లో శరవేగంగా జరుపుకుంటోంది .

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. అనంతపురం జిల్లా భద్రపట్నం అనే గ్రామంలో జరిగిన యదార్ధ ఘటనను తీసుకుని దర్శకుడు గాంధీ ఓ మంచి కథను తయారు చేశాడు.సగానికి పైగా టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈచిత్రం యొక్క పూర్తి టాకీ ఈ నెల 25 వరకు కోలార్ లో జరుగుతున్న షెడ్యూల్ తో కంప్లీట్ అవుతుంది అని అన్నారు .దర్శకుడు ఆర్ కె గాంధీ మాట్లడుతూ ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా:దేవిశ్రీ గురూజీ నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అని అన్నారు . అలాగే ప్రముఖ సీనియర్ నటుడు సుమన్ మా చిత్రం లో నటించడం మాకు గర్వకారణం అని అన్నారు .

నవంబర్ ప్రథమార్థంలో ఆడియో ఆవిష్కరణ జరపనున్నాం అని అన్నారు .

అనిల్‌, శృతిలయ, సుమన్‌,కవిత ,డా :దేవిశ్రీ గురూజీ , షఫీ, రాజేంద్ర, కింగ్‌ మోహన్‌, కిల్లర్‌ వెంకటేష్‌, జ్యోతి మొదలగు వారు నటిస్తున్న ఈ చిత్రానికి స్టంట్స్‌: శంకర్‌, కొరియోగ్రఫీ: ఎస్‌.ఎస్‌.కె. సందీప్‌, పాటలు: ఘంటాడి కృష్ణ, రామ్‌ పైడిశెట్టి; సంగీతం: ఘంటాడి కృష్ణ, కెమెరా: ప్రమోద్‌. ఆర్‌; నిర్మాతలు: ఎం.ఎన్‌. బైరారెడ్డి, నాగరాజు; కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం :ఆర్‌.కె.గాంధీ.​

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved