pizza
Producer Narayana Das chat
చిత్ర పరిశ్రమ నాకు అమ్మలాంటిది- -నిర్మాత నారాయణ దాస్ నారంగ్
You are at idlebrain.com > news today >
 
Follow Us

26 July
Hyderabad

ఏషియన్ సినిమాస్ సంస్థను ప్రారంభించి చిత్ర పంపిణీ రంగంలో 30 ఏళ్లుగా కొనసాగుతున్నారు నారాయణదాస్ నారంగ్. సోమవారం (జూలై 27) నారాయణదాస్ నారంగ్ పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ అభివృద్ధిలో ఆయన చేస్తున్న కాంట్రిబ్యూషన్ గుర్తు చేసుకుంటే... నారాయణదాస్ నారంగ్ ఇప్పటిదాకా దాదాపు 650 చిత్రాలను పంపిణీ చేశారు. అందులో చిత్ర పరిశ్రమ గర్వించే బాహుబలి లాంటి చిత్రాలు ఉండటం విశేషం. చిత్ర పరిశ్రమలో ఆయన సేవలకు గుర్తింపుగా గత ఏడాది తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు నారాయణదాస్ నారంగ్.

పుట్టినరోజు సందర్భంగా ఆయన మాట్లాడుతూ :
''చిత్ర పరిశ్రమ నాకు తల్లి లాంటిది. 30 ఏళ్లుగా ఫిల్మ్ ఇండస్ట్రీతో నాకు అనుబంధం ఉంది. ఈ పరిశ్రమ నాపై కొన్ని బాధ్యతలు పెట్టంది. వాటిని సక్రమంగా నెరవేర్చే ప్రయత్నం చేస్తాను. అలాగే సినిమా మీద నాకున్న ప్రేమ ఎప్పటికీ తగ్గదు. ఆ ప్రేమే నన్ను చిత్ర పరిశ్రమలోని వివిధ విభాగాల్లో అడుగుపెట్టేలా చేస్తోంది.సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఏఎంబీ సినిమాస్ మల్టీఫ్లెక్స్ నిర్మాణంతో ప్రేక్షకులకు అత్యుత్తమ సినిమాటిక్ ఎక్సీపిరియన్స్ కల్గించాము. ఏఎంబీ హైదరాబాద్ మొత్తంలో ది బెస్ట్ లగ్జరీ మల్టీఫ్లెక్స్.అంతే గాకుండా ఇప్పుడు మేము నిర్మాణ రంగం లోకి ఎంటర్ అయ్యాం. ఏమిగోస్ క్రియేషన్స్, పి రామ్మోహన్ రావుతో కలిసి "లవ్ స్టోరీ" అనే చిత్రాన్ని నిర్మిస్తున్నా. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశలో ఉండగా కరోనా లాక్ డౌన్ మొదలైంది.ఇంకా 15 రోజుల షూటింగ్ చేయాల్సి ఉంది. కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత మిగతా షూటింగ్ పూర్తి చేసి విడుదల చేస్తాం.మాకు శేఖర్ కమ్ముల పనితనం బాగా నచ్చింది.అందుకే మా తర్వాతి సినిమా కూడా ఆయన తోనే చేయబోతున్నాం.ఒక పెద్ద హీరో తో ఆ మూవీ ఉంటుంది.దానికి సంబంధించిన వివరాలు త్వరలో తెలియజేస్తాం."అని అన్నారు నారాయణదాస్ నారంగ్.

 






Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved