pizza
Raashi Khanna Green india challenge
You are at idlebrain.com > news today >
 
Follow Us

20 July
Hyderabad

గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ఇప్పుడు ఈ పేరు ప్రతి ఒక్కరికి సుపరిచితమే . ఎవరైనా నాకు ఛాలెంజ్ చేస్తే బాగుండు నేను సైతం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వామ్యం కావలి అనే స్థాయికి వెళ్ళింది అనడం అతిశయోక్తి లేదు . ప్రతి ఒక్కరికి మొక్కలు నాటి , వాటిని పెంచి , ప్రతి ఒక్కరికి తమ వంతు సామాజిక బాథ్యత నెరవేర్చేలా అవగాహనా కల్పిచడమే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ముఖ్య ఉద్దేశ్యం .కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు , భారత దేశం నలుమూల ల గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యాప్తి చెందింది ..

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక యజ్ఞంలా ముందుకు సాగుతుంది. ఈ కార్యక్రమంలో పలువురు సెలబ్రెటీలు, రాజకీయ నాయకులతో పాటు అన్ని వర్గాల ప్రజలు , పిల్లలు సైతం మొక్కలు నాటుతూ తమ సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్నారు. గతంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన టాలీవుడ్ బ్యూటీ రష్మీక మందాన్న ఛాలెంజ్ విసిరారు. రష్మిక ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన ప్రముఖ నటి రాశి ఖన్నా , ఈ రోజు Jmr White Lotus - Shaikpet లోని తన నివాసంలోమూడు మొక్కలు నాటారు. అనంతరం రాశి ఖన్నా మాట్లాడుతూ.. జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా గొప్ప కార్యక్రమమని, పెరిగిపోతున్న కాలుష్యానికి తగ్గించడానికి , పర్యావరణ సమత్యులత కోసం మొక్కలు నాటే కార్యక్రమము , భవిష్యత్ తరాలకు ఎంతో మేలుచేస్తుంది . అంతేకాదు తన అభిమానులందరి ఈ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ను ముందుకు తీసుకుపోయేలా.. ప్రతి ఒక్క అభిమాని మూడు మొక్కలు నాటాలని పిలుపునిచ్చింది. తను మరో ముగ్గురు నటీమణులకు రఖుల్ ప్రీతీ సింగ్ , కాజల్ , తమన్నా లకు ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా కోరారు .ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్న సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

 

 

 

 




Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved