pizza
Radha release on 12 May
మే 12న విడుదలవుతున్న శర్వానంద్ "రాధ"
You are at idlebrain.com > news today >
Follow Us

30 April 2017
Hyderabad

After the back to back successes of films like Run Raja Run, Malli Malli Idi Rani Roju, Express Raja and Shatamanam Bhavati, actor Sharwanand has another interesting project coming up, Radha. Presented by B.V.S.N. Prasad under the Sri Venkateswara Cine Chitra banner and directed by debutant Chandra Mohan, the film is going to be a complete entertainer and is produced by Bogapalli Bapineedu. And as a summer treat, the makers have decided to release the film on May 12, 2017.

Speaking about the same, B.V.S.N. Prasad shares, “The great response to the first look and teaser of Radha was quite a boost for us. In fact, even the two songs that we have released so far have got good reviews. Presently, the team is in Milan, shooting for the final song after which the film’s production part will be completed. We will soon be announcing the date of the film’s audio release too. We are soon going for censor also, so that we can have our film ready in time for May 12. With this film, Sharwanand’s success streak will go on as the director Chandra Mohan has managed to make a lovable entertainer which has the perfect dose of romance, action, comedy and of course entertainment. This film will surely be an equal treat to both the class and mass audiences.”

Starring Sharwanand and Lavanya Tripathi as the leads , the film has music by Radhan. Cinematography: Ghattamaneni Karthik. Editing: Kotagiri Venkateswara Rao, Producer: Bogavalli Bapineedu. Director: Chandra Mohan.

మే 12న విడుదలవుతున్న శర్వానంద్ "రాధ"

రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళీ ఇదిరాని రోజు, ఎక్స్‌ప్రెస్‌రాజా, శ‌త‌మానం భ‌వ‌తి వంటి వ‌రుస సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రాల‌తో దూసుకుపోతోన్న యువ స్టార్ హీరో శర్వానంద్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ చంద్ర‌మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో భోగ‌వ‌ల్లి బాపినీడు నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `రాధ‌`. ఈ సినిమాను మే 12న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా...
చిత్ర స‌మ‌ర్ప‌కులు బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ - ``రాధ సినిమా ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌కు, టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి భారీ స్పంద‌న వ‌చ్చింది. వ‌రుస విజ‌యాల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద త‌న సత్తా చాటుతున్న యువ క‌థానాయ‌కుడు శర్వానంద్ హీరోగా రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించిన రెండు పాట‌ల‌ను మార్కెట్లోకి విడుద‌ల చేశాం. రెండు పాట‌ల‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చాయి. ఇప్పుడు మిలాన్ ఓ పాట చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది. ఈ పాట పూర్త‌యితే నిర్మాణాంత‌ర కార్యక్ర‌మాలు స‌హా సినిమా మొత్తం పూర్త‌వుతుంది. ర‌ధ‌న్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మాన్ని త్వ‌ర‌లోనే నిర్వ‌హిస్తాం. అలాగే సెన్సార్ కార్య‌క్ర‌మాల‌న్నీ పూర్తి చేసి సినిమాను మే 12న విడుద‌ల చేస్తున్నాం. సినిమా అవుటండ్ అవుట్ ఎంట‌ర్‌టైన‌ర్‌. ద‌ర్శ‌కుడు చంద్ర‌మోహ‌న్ తొలి చిత్ర‌మే అయినా సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించారు. రొమాన్స్, కామెడీ , ఏక్షన్ సమపాళ్ళలో ఉండే మా సినిమా అటు క్లాస్ ప్రేక్షకులను, ఇటు మాస్ ప్రేక్షకులను అలరించే చిత్రం రాధ శ‌ర్వానంద్ కెరీర్‌లో మ‌రో హిట్ మూవీ అవుతుంది`` అన్నారు.

శ‌ర్వానంద్‌, లావ‌ణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రానికి సంగీతంః ర‌ధ‌న్‌, సినిమాటోగ్ర‌ఫీః కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని, ఎడిటింగ్ః కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు, నిర్మాతః భోగ‌వ‌ల్లి బాపినీడు, ద‌ర్శ‌క‌త్వంః చంద్ర‌మోహ‌న్‌.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved