pizza
Raghuvaran BTech contest
'రఘువరన్ బీటెక్' కోసం
యూత్ కి స్పెషల్ కాంటెస్ట్
You are at idlebrain.com > news today >
Follow Us

17 December 2014
Hyderabad

సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు, మంచి మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ధనుష్ హీరోగా నటించిన తాజా సూపర్ డూపర్ హిట్ మూవీ 'వేలై ఇల్లా పట్టదారి' తెలుగు తెరకు రానుంది. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కృష్ణచైతన్య సమర్పణలో స్రవంతి రవికిశోర్ ఈ చిత్రాన్ని అనువదించారు. 'కొలవెరి...' పాట ఫేం అనిరుధ్ ఈ చిత్రానికి స్వరాలందించారు.

మాస్ హీరో ధనుష్ తో కలిసి భోజనం చేసే అవకాశం వస్తే..? అది కూడా కొలవెరి..' పాటతో యువతను ఉర్రూతలూగించిన సంగీతదర్శకుడు అనిరుధ్ కూడా ఆ విందులో జాయిన్ అయితే.. ఇక చెప్పడానికేముంటుంది? అవకాశం కొట్టేసినవాళ్లు అదృష్టవంతులంటే అతిశయోక్తి కాదు. ఆ లక్ ని అందిపుచ్చుకోవాలంటే.. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు.

ధనుష్, అనిరుధ్ తో కలిసి డిన్నర్ చేసేటప్పుడు, ఆ ఇద్దర్నీ ఏమేం ప్రశ్నలడగాలనుకుంటున్నారో రాసి పంపించాలి.

17 ఏళ్ల నుంచి 29 ఏళ్ల లోపు వారికి మాత్రమే ఈ అరుదైన అవకాశం దక్కుతుంది.

ఇంకెందుకు ఆలస్యం.. పేపర్, పెన్ను తీయండి.. ప్రశ్నలు రాసేయండి.

వాటిని [email protected]. కి పంపించేయండి

అలాగే..

1. What is your goal in life ?
2. After graduation, how long will you be willing to wait to start your journey towards your goal ?
3. How far would you go to make sure you reach your goal or would you compromise and do whatever comes your way for a living ?

If you are unemployed -
1. How many jobs do you apply for in a week ?
2. What do you do in your free time ?
3. How does your family react when you still ask them money for your expenses ?

If you are employed -
1. What did you want to become when you were studying and what are you doing now ?
2. If you are doing something other than your dream job, what is stopping/stopped you from attaining your goal ?
3. How many interviews did you attend and what difficulties did you face before getting this job ?

ఈ ప్రశ్నలకు కూడా జవాబు రాసి పంపించండి.

లక్కీ డిప్ లో విజేతలైనవారికి ఈ చిత్రం ప్రీమియర్ షో తిలకించే అవకాశం కూడా దక్కుతుంది.

గమనిక: విజేతల్లో అమ్మాయిలకు ఓ సదుపాయం ఉంది. తమతో పాటు తోడుగా ఒకరిని తీసుకురావచ్చు.

ఈ వారంతంలో ఈ ఆడియో వేడుక వినూత్నంగా, భారీ ఎత్తున జరగనుంది. అదే రోజు విజేతలకు ఆహ్వానం అందుతుంది.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved