pizza
Rajugarintlo 7va Roju in post production work
You are at idlebrain.com > news today >
Follow Us

29 July 2015
Hyderabad

 

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో 'రాజుగారింట్లో 7వ రోజు'

అజయ్ ప్రధాన పాత్రల్లో భరత్, అర్జున్, వెంకటేష్,అక్షయ్, సుష్మిత నటీనటులుగా భరత్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై ఫిరోజ్ రాజ దర్శకత్వంలో భరత్ కుమార్ పీలం నిర్మిస్తున్న సినిమా 'రాజుగారింట్లో 7వ రోజు'. ఈ చిత్ర వివరాల గురించి దర్శకుడు ఫిరోజ్ రాజ మాట్లాడుతూ "అందరి జీవితాలలో జరిగే సంఘటనలే "రాజుగారింట్లో 7వ రోజు". చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. హర్రర్, కామెడి, క్రైం, థ్రిల్లర్ సహా అన్నీ ఎలిమెంట్స్ ఉన్న చిత్రమిది. కనిష్క చక్కని సంగీతాన్ని అందించారు. వచ్చే నెలలు పాటలను విడుదల చేసి అదే నెలలో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ చిత్రంలో అజయ్ రోల్ చాలా డిఫరెంట్ గా ఉండి ప్రేక్షకులను థ్రిల్ కి గురిచేస్తుంది. తాగుబోతు రమేష్, చిన్నా, చంటి, శ్యామ్, రవి ఇతర పాత్రల్లో అలరిస్తారు.

ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: క్రాంతి కె.కుమార్, మ్యూజిక్: కనిష్క్, స్టిల్స్: నాగభూషణం, నిర్మాత: భరత్ కుమార్ పీలం, రచన,దర్శకత్వం: ఫిరోజ్ రాజ.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved