pizza
Ramana Reddy award to Dhanraj
ధ‌న్‌రాజ్‌కు ర‌మ‌ణారెడ్డి పుర‌స్కారం
You are at idlebrain.com > news today >
Follow Us

22 August 2016
Hyderaba
d

తెలుగు సినిమాల్లో హాస్య‌న‌టుడిగా కెరీర్‌ను ప్రారంభించి, నిర్మాత‌గా, ఇటీవ‌ల హీరోగా న‌టిస్తున్న యువ న‌టుడు ధ‌న్‌రాజ్‌. తెలుగు సినిమా హాస్యాన్ని గుర్తుచేసుకోగానే త‌ప్ప‌క గుర్తొచ్చే నిన్నటిత‌రం లెజండ‌రీ హాస్య‌న‌టుడు ర‌మ‌ణారెడ్డి. రూపురేఖ‌ల్లో ర‌మ‌ణారెడ్డి, ధ‌న్‌రాజ్‌.. ఇద్ద‌రూ ఒకే ర‌కంగా అనిపిస్తుంటారు. బ‌క్క‌ప‌ల‌చ‌గా, పొడుగ్గా ఉంటారు. కాగా తాజాగా ధ‌న్‌రాజ్‌ను ర‌మ‌ణారెడ్డి పుర‌స్కారం వ‌రించడం ప్ర‌శంస‌నీయం. వంశీ - రేలంగి ఆర్ట్ అకాడెమీ స‌హ‌కారంతో క‌ళానిల‌యం సాంస్కృతిక సంఘ సేవా సంస్థ ఈ పుర‌స్కారాన్ని ప్ర‌దానం చేసింది. హాస్యోత్స‌వం పేరిట క‌ళానిల‌యం నిర్వ‌హించిన ప‌ద్మ‌శ్రీ రేలంగి, ర‌మ‌ణారెడ్డి, ప‌ద్మ‌నాభం జ‌యంతి మ‌హోత్స‌వంలో ధ‌న్‌రాజ్‌కు ర‌మ‌ణారెడ్డి ఎక్సెలెన్సీ పుర‌స్కారాన్ని అంద‌జేసింది. ఇదే కార్య‌క్ర‌మంలో వేణుకు రేలంగి ఎక్స‌లెన్సీ పుర‌స్కారాన్ని, శంక‌ర్‌కు పద్మ‌నాభం ఎక్సెలెన్సీ పుర‌స్కారాన్ని అంద‌జేశారు.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved