pizza
Ram Asur is releasing on 19 November
నవంబర్ 19న 'రామ్ అసుర్' గ్రాండ్ రిలీజ్.. అన్ని సినిమాల్లోకెల్లా ఇది చాలా డిఫరెంట్.. హైలైట్ పాయింట్స్ ఇవే అంటున్న మేకర్స్
You are at idlebrain.com > news today >
Follow Us

18 November 2021
Hyderabad

వెంక‌టేష్ త్రిప‌ర్ణ దర్శకత్వంలో అభిన‌వ్ స‌ర్ధార్‌, వెంక‌టేష్ త్రిప‌ర్ణ సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న "పీనట్ డైమండ్" చిత్రం మాస్ ఆడియన్స్‌కు రీచ్ కావాలని ఈ చిత్ర టైటిల్‌ను `రామ్ అసుర్`గా మార్చడమైనది. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా నవంబర్ 19న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో అభిన‌వ్ స‌ర్ధార్‌, రామ్ కార్తిక్, చాందిని త‌మిళ్‌రాస‌న్‌, శాని సాల్మాన్‌‌, శెర్రి అగర్వాల్ లీడ్ రోల్స్ పోషించారు. `బెంగాల్ టైగ‌ర్` ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఎఎస్‌పి మీడియా హౌస్, జివి ఐడియాస్ ప‌తాకాల‌పై నిర్మించారు.

ఇటీవల ఈ చిత్రంలోని పాటను టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు రిలీజ్ చేయగా విశేష స్పందన లభించింది. అలాగే ఈ చిత్ర ట్రైలర్‌ని ప్రముఖ దర్శకుడు క్రిష్ రిలీజ్ చేశారు. ఈ సినిమా టీజర్‌ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రిలీజ్ చేయడం విశేషం. ఇక రీసెంట్‌గా పలువురు సినీ ప్రముఖుల మధ్య గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన తెచ్చుకుంటోంది.

ఈ నేపథ్యంలో రేపు (నవంబర్ 19) థియేటర్లలోకి తమ రామ్ అసుర్ సినిమాగా గ్రాండ్‌గా రాబోతున్న నేపథ్యంలో దర్శకనిర్మాతలు ఈ చిత్రంలోని హైలైట్ పాయింట్స్ చెప్పారు. కథను కెమెరాలో రికార్డ్ చేయడం మొదలుకొని చిత్ర ప్రమోషన్స్ వరకూ అన్నింటా కొత్త స్ట్రాటజీ ఫాలో అయిన తాము.. ఈ సినిమాలో మరింత కొత్తదనాన్ని చూపించబోతున్నామని అన్నారు. డైమండ్ నేపథ్యంలో పల్లెటూరి వాతావరణం ప్రతిబింబించేలా జె. ప్రభాకర్ రెడ్డి కెమెరా వర్క్ మేజర్ హైలైట్ అవుతుందని చెప్పారు. నేటితరం ఆడియన్స్ కోరుకునే ప్రతి అంశాన్ని టచ్ చేశామని, ప్రతి 15 నిమిషాలకు ఎవ్వరూ ఊహించని విధంగా ఓ ట్విస్ట్ ఉటుందని, సినిమా చూస్తున్నంత సేపు సగటు ప్రేక్షకుడు ఓ కొత్త థ్రిల్ అనుభవిస్తాడనే నమ్మకం ఉందని మేకర్స్ అన్నారు.

ఇక రవితేజ లాంటి పెద్ద హీరోల సినిమాలను సంగీతం అందించిన భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సంగీత ప్రియులను కట్టిపడేస్తాయని చెప్పారు. ఇటీవలే సుధీర్ బాబు చేతుల మీదుగా రిలీజ్ చేసిన ఏం చేశావో మాయ సాంగ్ యూట్యూబ్‌లో భారీ వ్యూస్ రాబడుతోంది. ఈ పాట థియేటర్స్‌లో మరింత కిక్కిస్తుందని, అలాగే చిత్రంలోని ప్రతి సన్నివేశంలో కూడా ఏదో ఒక వెరైటీ చూస్తారని చిత్రయూనిట్ చెబుతోంది. ఇప్పటికే విడుదలైన 'రామ్ అసుర్' సినిమా ఎలా ఉంటుందో హింట్ ఇచ్చేసింది. కలికాలంలో మంచి- చెడు అనే కాన్సెప్ట్ తీసుకొని ఈ సినిమాను ఆసక్తికరంగా మలిచారని ట్రైలర్ ద్వారా అర్థమైంది. ట్రైలర్‌లో వినిపించిన ప్రతి డైలాగ్ కూడా సినిమాపై ఆసక్తి రేకెత్తించింది. అయితే ఇంతకుమించిన వినోదం, థ్రిల్, లవ్, రొమాన్స్ అన్నీ తమ 'రామ్ అసుర్' సినిమా హైలైట్ అవుతాయని దర్శకనిర్మాతలు నమ్మకంగా చెబుతున్నారు.

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved