pizza
Ram Charan- Sreenu Vaitla film shoots in Hyderabad
హైదరాబాద్ లో కీలక సన్నివేశాల చిత్రీకరణలో
మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్', సూపర్ డైరెక్టర్ 'శ్రీను వైట్ల' ల తో సుప్రసిద్ధ నిర్మాత దానయ్య డి.వి.వి నిర్మిస్తున్న చిత్రం :
You are at idlebrain.com > news today >
Follow Us

13 August 2015
Hyderabad

హైదరాబాద్ లో కీలక సన్నివేశాల చిత్రీకరణలో
మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్', సూపర్ డైరెక్టర్ 'శ్రీను వైట్ల' ల తో సుప్రసిద్ధ నిర్మాత దానయ్య డి.వి.వి నిర్మిస్తున్న చిత్రం :

విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సుప్రసిద్ధ నిర్మాత దానయ్య డి.వి.వి. 'డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి.' పతాకం పై శ్రీమతి డి. పార్వతి సమర్పణలో నిర్మిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ఈరోజు నుంచి హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది.

మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' తో పాటు ఇతర ప్రధాన తారాగణం అంతా పాల్గొనగా టాకీ పార్ట్ కు సంభందించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు నిర్మాత దానయ్య డి.వి.వి.

గత నెల 27 నుంచి బ్యాంకాక్ లో జరిగిన షూటింగ్ లో 'మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' నాయిక రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు ఇతర ప్రధాన తారాగణం అంతా పాల్గొనగా బ్యాంకాక్ లో భారీ పతాక సన్నివేశాలను, భారీ వ్యయంతో చిత్రీకరించామని తెలిపారు. అలాగే టాకీ పార్ట్ కు సంభందించిన సన్నివేశాలను కూడా చిత్రీకరించినట్లు తెలిపారు. బ్యాంకాక్ లో చిత్రీకరించిన సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని తెలిపారు నిర్మాత దానయ్య.

విజయదశమి కానుకగా చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ చిత్రానికి సంభందించి ఇంకా ఎలాంటి పేరును నిర్ణయించలేదని తెలిపారు. నాయక్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఈ సినిమా నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. భారీ తారాగణం తో పాటు, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం ముస్తాబౌతుందని అన్నారు.

ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' తో తాను రూపొందిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు 'శ్రీను వైట్ల' మాట్లాడుతూ " ఫ్యామిలి ఎంటర్టైనర్ విత్ యాక్షన్ 'కథా చిత్రం గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు ఆయన తెలిపారు. .

ఈ చిత్రానికి కథ : కోన వెంకట్, గోపి మోహన్, మాటలు: కోన వెంకట్, రచనా సహకారం: ఉపేంద్ర మాధవ్ , ప్రవీణ్

లైన్ ప్రొడ్యూసర్ : కృష్ణ ,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి. వై. ప్రవీణ్ కుమార్
సమర్పణ : డి. పార్వతి
నిర్మాత : దానయ్య డి.వి.వి.
మూలకథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : శ్రీను వైట్ల


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved