pizza
Ram Leela music launch on 7 February
You are at idlebrain.com > news today >
Follow Us

07 February 2015
Hyderabad

డ్ర‌మ్స్ మాస్ట‌ర్ శివ‌మ‌ణి నేప‌ద్య‌సంగీతంతో విడుద‌ల‌య్యిన‌ ట్రైల‌ర్ తోనే ఆక‌ట్టుకున్న రామ్‌లీల


యంగ్ అండ్ ఎన‌ర్టిటిక్ హీరో హ‌వీష్‌, అభిజిత్ క‌థానాయిక‌లుగా, ప్రేమ‌క‌థాచిత్రం, ల‌వర్స్ లాంటి బ్యాక్ టు బ్యాక్ సూప‌ర్‌హిట్స్ ని సొంతం చేసుకున్న నందిత హీరొయిన్ గా, శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో తెర‌కెక్కిన చిత్రం‘రామ్‌లీల‌’. కోనేరు సత్యనారాయణ సమర్పణలో రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు చిన్నా సంగీతం అందించారు. ఈ సినిమాకి చెందిన షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని పోస్ట్ ప్రోడక్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది.

ఈ సినిమా ఆడియోని ఈ నెల 7న విడుద‌ల చేస్తున్నారు. రామ్‌లీల చిత్రానికి సంభందించి ఫ‌స్ట్ లుక్ ట్రైల‌ర్ ని ఇటీవ‌లే విడుద‌ల చేశారు. ఈ టీజ‌ర్ అటు యూత్ ఆడియ‌న్స్ తో పాటు, ఫ్యామిలి ఆడియ‌న్స్ ని కూడా ఆక‌ట్టుకుంటుంది. ముఖ్యంగా ఆ ట్రైల‌ర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ని ప్ర‌ముఖ డ్ర‌మ్స్ మాస్ట‌ర్ శివ‌మ‌ణి అందించ‌టం విశేషం. ఈ ట్రైల‌ర్ ని చూసిన ప్ర‌తి ప్రేక్ష‌కుడు శివ‌మ‌ణి సంగీతం గురించి మాట్లాడుకోవ‌టం వ‌ల‌న‌ రామ్‌లీల చిత్రం తెలుగు ప్రేక్ష‌కులకి మ‌రింత ద‌గ్గ‌ర‌య్యింది. గ‌తంలో హీరో హ‌వీష్ చేసిన చిత్రాల్లో ఈచిత్రం స్పెష‌ల్ గా వుండబోతుంది. త‌ప్ప‌కుండా ఈ చిత్రం మంచి విజ‌యాన్ని సాధిస్తుంద‌ని చిత్ర యూనిట్ న‌మ్ముతుంది. అలాగే గొల్డేన్ లెగ్ గా హిట్స్ మీద హిట్స్ కొడుతున్న నందిత‌ న‌ట‌న ఈచిత్రాన్ని మ‌రింత విజ‌యం వైపుకు తీసుకువెలుతుంది. చిన్నా అందించిన సంగీతం మంచి విజ‌యాన్ని సాధిస్తాయి.ట్రై యాంగిల్ లవ్ స్టొరీలా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టుకుంటుంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి ఫిబ్రవరి 20న విడుదల చేసేలా ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది. మలేసియా నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథలో లవ్, కామెడీ, సెంటిమెంట్ ఇలా అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. ఈ తరహా ప్రేమకథను తెరకెక్కించడం ఇదే మొదటిసారని, హవీష్, అభిజిత్ ల పాత్రలు చాలా బాగుంటాయని ఈ చిత్ర టీం అంటోంది. ఎస్. గోపాల్‌రెడ్డి ఈ మూవీకి సినిమాటోగ్రాఫి చిత్రానికి గ్రాండియ‌ర్ లుక్ తీసుకువ‌చ్చింది.

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved