pizza
Baahubali’ star, Rana Daggubati is soon to essay the role of South India's greatest strongman and wrestler - Kodi Rammurthy Naidu
దక్షిణ భారత మహా మల్లయోధుడు 'కోడి రామ్మూర్తి నాయుడు' గా 'బాహుబలి' స్టార్, రానా దగ్గుబాటి
You are at idlebrain.com > news today >
Follow Us

16 May 2018
Hyderabad

With an​ undefeated record of over 5000 bouts, Kodi Rammurthy Naidu was awarded the title of ​'Indian Hercules and 'Kalayuga Bhima' by King George. ​The young Kaliyuga Bhima rose like a phoenix in the early 1900’s, when the British Empirical rule was firmly established in India. He was a brave-heart who fought his battles from a sports ring. Wrestling and bodybuilding were natural passions that spurred him to become the undefeated champion of the wrestling world and fueled India’s independence movement.

Rana Daggubati became a huge fan of Kodi Ramamurthy Naidu as he grew up reading about him in text books. It would be a dream role for the Baahubali star and a fitting tribute to the legendary wrestler from South India.

Rana Daggubati has a series of big spectacle films lined up but this epic, spectacular, action drama is soon to be made in Hindi and Telugu. To be produced in collaboration with a top production house in South and a major internationalStudio. A top director is already in talks to helm the project and if all goes well, the shooting of the film is soon to start. The story has been registered with the writers’association and the pre-production is currently in progress.

దక్షిణ భారత మహా మల్లయోధుడు 'కోడి రామ్మూర్తి నాయుడు' గా 'బాహుబలి' స్టార్, రానా దగ్గుబాటి

5000 కి పైగా పోటీల్లో ఓటమనేదే ఎరుగని మహా మల్లయోధుడు కోడి రామ్మూర్తి నాయుడు గారు. ఆయన ప్రతిభ కి అప్పట్లో కింగ్ జార్జ్ స్వయంగా 'ఇండియన్ హెర్క్యూలెస్', 'కలియుగ భీమ' బిరుదులతో కోడి రామ్మూర్తి నాయుడు గారిని సత్కరించారు. బ్రిటిష్ పాలన బలంగా ఉన్న 1900 తొలి నాళ్ళల్లో , ఈ యువ కలియుగ భీముడు తన సత్తా చాటాడు. మహా ధైర్యవంతుడు అయిన ఈయన మల్లయుద్ధం బరిలో అనేక పోరాటాల్లో పాల్గొన్నారు. బాడీ బిల్డింగ్, మల్లయుద్ధం పట్ల ఉన్న అమితాసక్తి, ఇష్టం కోడి రామ్మూర్తి నాయుడు గారిని ఆ రోజుల్లో మల్లయుద్ధంలో ఓటమనేదే ఎరుగని ధీరుడినిగా నిలబెట్టింది. గోదాలో ఈయన ప్రదర్శించిన పరాక్రమం భారత దేశ స్వాతంత్ర్యోద్యమానికి స్ప్హూర్తి రగిల్చింది.

కోడి రామ్మూర్తి నాయుడు గురించి పాఠ్య పుస్తకాల్లో చదువుతున్నప్పటి నుండే రానా దగ్గుబాటి కి ఆయన మీద విపరీతమైన అభిమానం ఏర్పడింది. ఈ పాత్ర రానా కెరీర్ లోనే మరిచిపోలేని పాత్ర గా నిలిచిపోతుంది. అలాగే ఈ చిత్రం ఆ మహా మల్లయోధ వీరునికి ఘనమైన నివాళిగా రూపుదిద్దుకోనుంది.

ప్రస్తుతం ఎన్నో భారీ, వైవిధ్యమైన చిత్రాలతో బిజీగా ఉన్న రానా దగ్గుబాటి త్వరలో చేయబోయే ఈ భారీ, చారిత్రాత్మక యాక్షన్ డ్రామా తెలుగు, హిందీ భాషల్లో రూపొందనుంది. సౌత్ కి చెందిన ఒక అగ్ర నిర్మాణ సంస్థ తో పాటు ప్రముఖ అంతర్జాతీయ నిర్మాణ సంస్థ కలిసి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రం కోసం ఒక అగ్ర దర్శకునితో సంప్రదింపులు జరుగుతున్నాయి. అన్ని అనుకున్నట్టు జరిగితే అతి త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం అవుతుంది. చిత్ర కథని రైటర్స్ అసోసియేషన్ లో రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.


 


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved