pizza
Rashmi Gautam about Next Nuvve
ఆ పేరు ఎందుకు వచ్చిందో నాకు తెలియడం లేదు - రష్మీ గౌతమ్‌
You are at idlebrain.com > news today >
Follow Us

23 October 2017
Hyderabad

వీ4 క్రియేషన్స్‌ బేనర్‌పై ఆది, వైభవి, రష్మీ తారాగణంగా రూపొందిన చిత్రం 'నెక్స్‌ట్‌ నువ్వే'. ప్రభాకర్‌ దర్శకుడు. బన్నీ వాసు నిర్మాత. సినిమా నవంబర్‌ 3న విడుదలవుతుంది.

ఈ సందర్భంగా రష్మీ గౌతమ్‌ మాట్లాడుతూ '''నెక్స్‌ట్‌ నువ్వే' చిత్రంలో నా పాత్ర గ్లామరస్‌గా ఉంటుంది. ఈ సినిమాలో నేను చీరకట్టులోనే కనపడతాను. హీరోను రెచ్చగొట్టే పాత్ర నాది. నాకు తెలుగు సరిగా రాదు. కానీ తెలుగు ప్రేక్షకులు నన్ను బుల్లి తెరపై ఆదరించారు. అలాగే వెండితరపై కూడా ఆదరిస్తారని నమ్మకంగా ఉన్నాను. సినిమాలో నేను బ్రహ్మాజీ సోదరి పాత్రలో కనపడతాను. సినిమాలో అన్నీ ఎలిమెంట్స్‌ ఉంటాయి. ఈ సినిమాలో కూడా నా పాత్ర పేరు రష్మీ. కాన్సెప్ట్‌ బేస్డ్‌ మూవీ. నా పాత్రకు చాలా ప్రాముఖ్యత వుంటుంది. నేను చాలా సెక్సీగా ఉన్నానని, సెక్సీ బాంబ్‌ అని చాలా మంది కామెంట్స్‌ చేస్తుంటారు. వారలా అనడం పట్ల నాకేం ఇబ్బంది లేదు. గ్లామర్‌ ఉంది కాబట్టి చూపిస్తున్నాను. కొంతకాలం తర్వాత నేను గ్లామర్‌గా కనపడినా..ఎవరూ చూడరు. చాలా మందితో పోల్చి చూస్తే నేను చూపించే గ్లామర్‌ చాలా తక్కువగానే ఉంటుంది. కానీ నాకు గ్లామర్‌ క్వీన్‌ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలియడం లేదు. బికినీలు వేయడం అనేది ఈరోజుల్లో కామన్‌ అయిపోయింది. ప్రభాస్‌గారు, మహేష్‌గారు..ఇలా అందరితో నాకు నటించాలని ఉంది. అయితే అవకాశాల కోసం నేను ఎవరినీ అడగడం లేదు. నాకు వస్తున్న అవకాశాల్లో మంచి వాటిని ఎంచుకుంటున్నాను. ఈ సినిమాలో కామెడీ, గ్లామర్‌ ఎలిమెంట్స్‌తో పాటు భయం అనే ఎలిమెంట్‌ కూడా ఉంటుంది. ప్రభాకర్‌గారు సినిమాల్లో రాక ముందు టీవీ సీరియల్స్‌ను డైరెక్ట్‌ చేశారు. అలాగే నటించారు కూడా. కాబట్టి ఓ యాక్టర్‌ నుండి ఏం రాబట్టుకోవాలో ప్రభాకర్‌గారికి బాగా తెలుసు. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తున్నాను. తెలుగులో ఏ సినిమాను ఇంకా కమిట్‌ కాలేదు. బిగ్‌బాస్‌-2లోనే కాదు, బిగ్‌బాస్‌ 1లో కూడా నన్ను పార్టిసిపేట్‌ చేయమని సంప్రదించారు. కానీ నాకు ఆసక్తి లేదు''అన్నారు.

interview gallery

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved