pizza
Erotic Thriller RED Getting Ready for Release
విడుదల సన్నాహాల్లో ఎరోటిక్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్ 'రెడ్'
You are at idlebrain.com > news today >
Follow Us

27 August 2016
Hyderaba
d

కన్నడలో ఘన విజయం సాధించిన 'రెడ్‌' చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో నిర్మిస్తున్నారు యువ నిర్మాత భరత్‌. కామిని, రాహుల్‌, రాజ్‌ ఆర్యన్‌, పృధ్వి ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రాన్ని భరత్‌ పిక్చర్స్‌ పతాకంపై ఆయన తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న ఆలుమగల మధ్య ఓ అపరిచితుడు ప్రవేశించడం వల్ల.. వారి జీవితంలో చోటు చేసుకున్న అనూహ్య సంఘటనల సమాహారంగా రూపొందిన ఈ చిత్రం కన్నడలో పెద్ద విజయం సాధించింది.

నిర్మాత భరత్‌ మాట్లాడుతూ... 'ఈ చిత్రానికి కన్నడలో దర్వకత్వం వహించిన రాజేష్‌మూర్తి.. ఈ చిత్రాన్ని కన్నడలో నిర్మించడంతోపాటు సంగీతం కూడా సమకూర్చడం విశేషం. ఆద్యంతం ఉత్కంఠ కలిగిస్తూ.. ప్రేక్షకులకు రసానుభూతిని పంచే ఎరోటిక్‌ మర్డర్‌ మిస్టరీ 'రెడ్'. కన్నడలో కంటే తెలుగులో ఈ చిత్రం మరింత పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ చిత్రాన్ని అతి త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం"' అన్నారు.

ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: అంజన్‌, పబ్లసిటీ డిజైనర్: వెంకట్.ఎం, నిర్మాత: భరత్‌, సంగీతం-దర్శకత్వం: రాజేష్‌మూర్తి.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved