pizza
RED Movie songs shooting in Italy
ఇటలీలో పాటల చిత్రీకరణ జరుపుకుంటున్న రామ్ 'రెడ్'
You are at idlebrain.com > news today >
Follow Us

15 February 2020
Hyderabad

After registering a phenomenal success with Ismart Shankar, Hero Ram Pothineni seems to leave no stone unturned when it comes to bringing up visual grandeur on the roll for his next ‘RED’.

Directed by Kishore Tirumala, lead pair Ram and Malvika Sharma are now taking part in this brisk schedule of 2 songs commencing from February 12th till February 20th. Shobi master is choreographing these two songs at picturesque locations of Tuscany, Florence, and Dolomites in Italy.

Taking all the necessary permissions for the shoot to be on a grand scale, one of these songs are known to be shot, at the iconic, 'Carnevele de Venezia' a famous carnival that takes place at Venice, Italy, once a year.

While the talkie part has been wrapped up already, movie unit will be returning to Hyderabad to shoot one more song soon & Post-production is going on simultaneously.

As announced earlier on launch ceremony, 'Red' will hit the theaters on April 9th.

Cast: Ram Pothineni, Nivetha Pethuraj, Malvika Sharma, and Amritha Aiyer
Music: Mani Sharma
Cinematography: Sameer Reddy
Producer: Sravanthi Ravikishore
Banner: Sri Sravanthi Movies

ఇటలీలో పాటల చిత్రీకరణ జరుపుకుంటున్న రామ్ 'రెడ్'

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై 'స్రవంతి' రవికిషోర్‌ నిర్మిస్తున్న చిత్రం ‘రెడ్‌’. కిషోర్‌ తిరుమల దర్శకుడు. కృష్ణ పోతినేని చిత్రసమర్పకులు. సెన్సేషనల్‌ బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ఇస్మార్ట్ శంకర్‌' తర్వాత రామ్‌ హీరోగా చేస్తున్న చిత్రం ఇది.

చిత్ర నిర్మాత స్రవంతి రవి కిషోర్ మాట్లాడుతూ.."ఇప్పటి వరకూ రామ్‌ చేసిన సినిమాలకు పూర్తి విభిన్నంగా ఉంటుంది. రామ్‌ - తిరుమల కిషోర్‌ కాంబినేషన్‌లో ఇది మూడో చిత్రం. 'నేను శైలజ', 'ఉన్నది ఒకటే జిందగీ' విజయాల తర్వాత వాళ్లిద్దరి కాంబినేషన్‌లో మళ్లీ సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. మా సంస్థలో ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ పనిచేయడం ఇదే తొలిసారి. గోవా ,హైదరాబాద్, వైజాగ్ ల్లో జరిపిన షూటింగ్ తో టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. ప్రస్తుతం ఇటలీలో రెండు పాటల చిత్రీకరణ చేస్తున్నాం. ఈ నెల 12 నుంచి ఇటలీలోని టస్క్, ఫ్లారెన్స్, డోలో మైట్స్ లాంటి ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్నాం . హీరో రామ్, మాళవిక శర్మ ల పై రెండు పాటలను చిత్రీకరిస్తున్నాం . ఈ నెల 20వరకు చిత్రీకరణ జరుగుతుంది . శోభి మాస్టర్ కోరియోగ్రఫీ చేస్తున్నారు. హైదరాబాద్ తిరిగి వచ్చిన తరువాత మరో పాటని చిత్రీకరించనున్నాం . దాంతో షూటింగ్ మొత్తం పూర్తైనట్లే. మరోపక్క సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ముందే అనౌన్స్ చేసినట్లు ఏప్రిల్ 9న ఈ సినిమా రిలీజ్ చేయనున్నాం " అని తెలియజేశారు.

రామ్, నివేదా పేతురాజ్ , మాళవిక శర్మ , అమృతా అయ్యర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: కృష్ణ పోతినేని, సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్‌ రెడ్డి, ఆర్ట్: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఫైట్స్ : పీటర్ హెయిన్స్ ,ఎడిటింగ్‌: జునైద్‌.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved