ఆర్.కె.స్టూడియోస్ బ్యానర్‌పై రేవంత్, నోయల్, హేమంత్, లాస్య, శోభిత ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం `రాజా మీరు కేక`. కృష్ణ కిషోర్ దర్శకత్వంలో రాజ్‌కుమార్.ఎం ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా జూన్ 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో రేవంత్ పాత్రికేయులతో మాట్లాడారు.
రేవంత్ మాట్లాడుతూ - ``''రాజా మీరు కేక' చిత్రంలో నేను సాఫ్ట్‌వేర్‌లో జాబ్ చేసే మధ్య తరగతి యువకుడి పాత్రలో కనపడతాను. నా స్నేహితులుగా నోయల్, హేమంత్, లాస్య నా స్నేహితలుగా కనపడతారు. మా అందరం కుటుంబాలంటే విలువనిస్తుంటాం. మా స్నేహితులంతా కలిసి మన సిస్టమ్‌లోని ఓ సమస్యను ఎలా పరిష్కరించామనదే కథ. శోభిత నాకు జోడిగా నటిస్తుంది. నేను సినిమా బ్యాక్‌గ్రౌండ్ నుండే వచ్చాను. నేను జర్నలిస్ట్‌గా పనిచేసిన తర్వాత శ్రీరామరాజ్యం సినిమాను నాన్నగారు నిర్మించారు. తర్వాత ఇంటింటా అన్నమయ్య సినిమాలో హీరోగా నటించాను. ఆ సినిమా విడుదల జాప్యంలో కాస్తా నిరాశ పడ్డ మాట నిజమే. సినిమాల్లో గ్యాప్ వచ్చినమాట తెలిసిందే. తర్వాత డాక్యుమెంటరీస్‌లో నటించాం. సినిమాకు సంబంధించిన అన్ని విభాగాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది. దర్శకుడిని కలిసినప్పుడు ఆయన చెప్పిన కథ నచ్చడంతో ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నాను. ఆయనకు కథపై ఉన్న పట్టు, స్క్రీన్‌ప్లే నచ్చింది. చాలా ఫ్రెండ్లీ పర్సన్. నిర్మాతగారు అందరికీ స్వేచ్చనిచ్చారు. ఆయన ఇచ్చిన స్పేస్ వల్లనే సినిమా అవుట్‌పుట్ బాగా వచ్చింది. నెక్స్‌ట్ మూవీస్ గురించి త్వరలోనే తెలియజేస్తాను'' అన్నారు.