pizza
Right Right shooting completed
`రైట్ రైట్` షూటింగ్ పూర్తి
You are at idlebrain.com > news today >
Follow Us

5 April 2016
Hyderaba
d

సుమంత్ అశ్విన్ హీరోగా మ‌ను ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ స‌త్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై జె.వంశీకృష్ణ నిర్మిస్తున్న చిత్రం `రైట్ రైట్‌`. వ‌త్స‌వాయి వెంక‌టేశ్వ‌ర్లు స‌మ‌ర్పిస్తున్నారు. `బాహుబ‌లి` ఫేమ్ ప్ర‌భాక‌ర్ ఇందులో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. పూజా జ‌వేరి క‌థానాయిక‌. ఇటీవ‌లే ఈ సినిమా షూటింగ్ పూర్త‌యింది.

ఈ సంద‌ర్భంగా నిర్మాత జె.వంశీకృష్ణ మాట్లాడుతూ ``మా సినిమా తొలి షెడ్యూల్‌ను అర‌కు, ఒడిశాలో 25 రోజులు చిత్రీక‌రించాం. రెండో షెడ్యూల్‌ను జ‌న‌వ‌రి 20 నుంచి 30 వ‌ర‌కు వికారాబాద్‌లో చేశాం. వికారాబాద్‌లోని బ‌స్ డిపో, బ‌స్టాండు, ఫారెస్ట్ లో కీల‌క స‌న్నివేశాల‌ను తెర‌కెక్కించాం. మూడో షెడ్యూల్‌ను ఇటీవ‌ల కేర‌ళ‌లో చిత్రీక‌రించాం. క్లైమాక్స్, పాట‌, ఛేజ్ సన్నివేశాల‌ను తెర‌కెక్కించ‌డంతో షూటింగ్ మొత్తం పూర్త‌యింది. ఐదు పాట‌లున్నాయి. శ్రీమ‌ణి రాశారు. జె.బి. మంచి ట్యూన్లు ఇచ్చారు. త్వ‌ర‌లోనే పాట‌ల‌ను విడుద‌ల చేస్తాం. సినిమాను మే నెలాఖ‌రున‌గానీ, జూన్ ప్ర‌థ‌మార్ధంలోగానీ విడుద‌ల చేస్తాం`` అని అన్నారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ``సుమంత్ అశ్విన్ కెరీర్‌లో మంచి సినిమా అవుతుంది. `ల‌వ‌ర్స్`, `కేరింత‌` సినిమాల స‌క్సెస్‌లో ఉన్న ఆయ‌న‌కు ఈ సినిమా గుర్తుండిపోతుంది. నాజ‌ర్ చాలా అద్భుత‌మైన పాత్ర‌ను పోషించారు. తొలి స‌గం వినోదాత్మ‌కంగా సాగుతుంది. మ‌లి స‌గంలో మిస్ట‌రీ ఉంటుంది. మొత్తానికి ఉత్కంఠ‌భ‌రితంగా సాగే చిత్ర‌మ‌వుతుంది. `బాహుబ‌లి` ప్ర‌భాక‌ర్ ఇందులో డ్రైవ‌ర్‌గా, సుమంత్ అశ్విన్ కండ‌క్ట‌ర్‌గా క‌నిపిస్తారు. మ‌ల‌యాళంలో ఘ‌న విజ‌యాన్ని మూట‌గ‌ట్టుకున్న `ఆర్డిన‌రీ` సినిమా స్ఫూర్తితో తెర‌కెక్కిస్తున్నాం. మ‌న తెలుగు నేటివిటీకి త‌గ్గ‌ట్టు మార్పులు, చేర్పులు చేశాం. ఎస్‌.కోట నుంచి గ‌విటికి వెళ్లే ఓ ఆర్టీసీ బ‌స్సు ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తుంది. కామెడీ, ల‌వ్‌, మిస్ట‌రీ అంశాలున్న చిత్ర‌మిది`` అని తెలిపారు.

నాజ‌ర్‌, ధ‌న‌రాజ్‌, `ష‌క‌ల‌క` శంక‌ర్‌, తాగుబోతు ర‌మేశ్‌, జీవా, రాజా ర‌వీంద్ర‌, భ‌ర‌త్‌రెడ్డి, వినోద్‌, పావ‌ని, క‌రుణ‌, జ‌య‌వాణి త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమాకు సంగీతం: జె.బి., పాట‌లు: శ్రీమ‌ణి, కెమెరా: శేఖ‌ర్ వి.జోస‌ఫ్‌, మాట‌లు: `డార్లింగ్‌` స్వామి, ఆర్ట్ : కె.ఎమ్‌.రాజీవ్‌, కో ప్రొడ్యూస‌ర్‌: జె.శ్రీనివాస‌రాజు, నిర్మాత‌: జె.వంశీకృష్ణ‌, ద‌ర్శ‌క‌త్వం: మ‌ను, స‌మ‌ర్ప‌ణ‌: వ‌త్స‌వాయి వెంక‌టేశ్వ‌ర్లు.​


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved