15 December 2014
Hyderabad
ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలకి సూపర్బ్ సంగీతాన్ని అందించిన సంగీత దర్శకుడు చక్రి, ఈరోజు ఉదయం మరణించారు ఈవార్త విని హీరో సాయి ధరమ్ తేజ్ షాక్ కి లోనయ్యారు.
సాయి ధరమ్ తేజ్ తన విచారాన్ని తెలియజేస్తూ..ఈ రోజు సడన్ గా చక్రి గారి వార్త విని విచారానికి లోనయ్యాను. ఆయన నాకు చాలా స్పెషల్. నా మొదటి చిత్రం రేయ్ కి ఆయన సంగీతాన్ని అందించారు. చక్రి గారు భౌతికంగా లేకపోయినా ఆయన పాటల ద్వారా చిరకాలం చిరంజీవిలా తెలుగు పాట వున్నంత కాలం బ్రతికేవుంటారు.చక్రి గారి మరణం జీర్ణించుకోలేనిది , చక్రి గారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ , వారి కుటుంబ సభ్యులకి నా తీవ్ర సంతాపాన్ని తెలుపుతున్నాను అని హీరో సాయి ధరమ్ తేజ్ అన్నారు.