pizza
Sai Dharam Tej interview (Telugu) about Jawaan
`జ‌వాన్‌` త‌ప్ప‌కుండా హిట్ అవుతుంది - సాయిధ‌ర‌మ్‌తేజ్‌
You are at idlebrain.com > news today >
Follow Us

30 November 2017
Hyderabad

వ‌రుస‌గా సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నారు సాయిధ‌ర‌మ్‌తేజ్‌. మెగా మేన‌ల్లుడిగా సినిమా ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మైన సాయి ధ‌ర‌మ్‌తేజ్ ఖాతాలోమంచి సినిమాలే ఉన్నాయి. తాజాగా ఆయ‌న న‌టించిన సినిమా `జ‌వాన్‌`. బీవీయ‌స్ ర‌వి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా డిసెంబ‌ర్1న విడుద‌ల కానుంది. ఈ చిత్రం గురించి సాయిధ‌ర‌మ్‌తేజ్ హైద‌రాబాద్‌లో విలేక‌రుల‌తో ముచ్చ‌టించారు. ఆ విశేషాలు..

* `జ‌వాన్‌` గురించి చెప్పండి?
- 2015లో నాకు ఈ క‌థ‌ను మ‌చ్చ ర‌వి చెప్పారు. చాలా ఇంట్ర‌స్టింగ్‌గా అనిపించింది. అస‌లు ఈ సినిమాను వ‌దులుకోకూడ‌ద‌ను అని అనిపించింది. వెంట‌నే ఒప్పుకుని చేసేశా. ఇప్పుడు రిలీజ్‌కి వ‌చ్చింది.

* అస‌లు సినిమా ఏంటి?
- సందేశాత్మ‌క చిత్ర‌మిది. ప్ర‌తి ఇంటికీ ఒక‌రు జ‌వానులాగా ఉండాలి అని చెప్పే సినిమా ఇది. మ‌న‌లో ప్ర‌తి ఒక్క‌రూ ఒక జ‌వానులా ఉండాల‌ని తెలిపాఏ సినిమా. బాధ్య‌త గ‌ల పౌరుడు ఎలా ఉండాలో చెప్పే సినిమా. మంచి వినోదాన్ని మిళితం చేసి తెర‌కెక్కించారు.

* దిల్‌రాజుతో మ‌ర‌లా సినిమా చేయ‌డం ఎలా ఉంది?
- ఆయ‌న నాకు నిర్మాత మాత్ర‌మే కాదు. మా కుటుంబంలో ఓ స‌భ్యుడై పోయారు. న‌న్ను సొంత త‌మ్ముడిలా ట్రీట్ చేస్తారాయ‌న‌. నా జీవితంలో ఆయ‌న చాలా స్పెష‌న‌ల్ ప‌ర్స‌న్‌.

* ఇందులో కొత్త‌గా క‌నిపించిన‌ట్టున్నారు?
- ఆ క్రెడిట్ మొత్తం ర‌విదేనండీ. నా స్టైలిస్ట్, ర‌వి క‌లిసి ఈ లుక్ డిజైన్ చేశారు.

interview gallery

* బీవీయ‌స్ ర‌వికి హిట్ లేద‌నే ఆలోచ‌న రాలేదా?
- నేను హిట్స్ నీ, ఫ్లాప్‌ల‌నూ ప‌ట్టించుకోనండీ. ఆ లెక్క‌న నాక్కూడా ఈ మ‌ధ్య కాలంలో స‌రైన హిట్ లేదుగా. నేను క‌థ‌ను న‌మ్మానంతే. జ‌యాప‌జ‌యాల‌ను కాదు.

* మీకు హిట్ లేద‌ని మీరే అంటున్నారు. మ‌రి ఆ టైమ్‌లో మీ మాన‌సిక ప‌రిస్థితి ఎలా ఉంటుంది?
- నేను జ‌యాప‌జ‌యాల‌ను ఒకే విధంగా తీసుకోగ‌ల‌ను. అది నాకు బ‌లాన్నిస్తుంది. అంతేగానీ దిగాలు ప‌డిపోను.

* పాట‌ల‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది?
- మేం చేసే సినిమా ఎలా ఉన్నా.. నేను త‌మ‌న్ క‌లిసి చేసిన సినిమాల్లో సంగీతం చాలా బావుంటుంది. ఈ సినిమాకు కూడా అదే వ‌ర్క‌వుట్ అయింది. అందుకే పాట‌ల‌కు చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది.

* ఈ ఏడాది మీ జీవితంలోమ‌ర్చిపోలేని రోజు ఉందా?
- ఉందండీ. డిసెంబ‌ర్ 1. జ‌వాన్ చిత్రం విడుద‌ల‌య్యే రోజు. సినిమా చూసిన ప్ర‌తి ఒక్క‌రూ సంతృప్తిగా ఇంటికి వెళ్లే రోజు. అదే నాకు ఆనందాన్ని పంచే రోజు.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved