pizza
Sai Dharam Tej at Right Right shooting location
`రైట్ రైట్` అంటున్న సాయిధరమ్ తేజ్
You are at idlebrain.com > news today >
Follow Us

04 March 2016
Hyderaba
d

ఇద్దరు హీరోల సినిమాల షూటింగ్స్ ఒకే ఏరియాలో పక్క పక్క జరిగితే.. ఆ ఇద్దరు హీరోలు బ్రేక్ టైమ్ లో కలుసుకుని, కాసేపు కబుర్లు చెప్పుకుంటారు. ఆ హీరోలిద్దరూ మంచి స్నేహితులైతే చెప్పడానికి ఏముంది.. తాము చేసే చిత్రాలు హిట్టవ్వాలని కోరుకుంటారు. ఇటీవల సాయిధరమ్ తేజ్, సుమంత్ అశ్విన్ కలుసుకున్నప్పుడు అలానే ఒకరికొకరు ఆల్ ది బెస్ట్ చెప్పుకున్నారు. ఆ విషయంలోకి వస్తే..

సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సుప్రీమ్' చిత్రం షూటింగ్, సుమంత్ అశ్విన్ హీరోగా రూపొందుతున్న 'రైట్ రైట్' షూటింగ్ ఇటీవల పక్క పక్కనే జరిగాయి. ఈ ఇద్దరూ చిన్నప్పట్నుంచీ మంచి స్నేహితులు. దాంతో బ్రేక్ టైమ్ లో 'సుప్రీమ్' హీరో సాయిధరమ్ తేజ్.. క్యూట్ హీరో సుమంత్ అశ్విన్ ని కలవడానికి 'రైట్ రైట్' షూటింగ్ లొకేషన్ కి వెళ్లారు. ఈ స్నేహితులిద్దరూ కాసేపు ముచ్చట్లు చెప్పుకున్నారు. 'రైట్ రైట్'కి బృందానికి సాయిధరమ్ తేజ్ శుభాకాంక్షలు చెప్పి, మళ్లీ తన షూటింగ్ లొకేషన్ కి వెళ్లారు.

సుమంత్ అశ్విన్ హీరోగా మ‌ను ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ స‌త్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై జె.వంశీకృష్ణ నిర్మిస్తున్న చిత్రం `రైట్ రైట్‌`. `బాహుబ‌లి` ఫేమ్ ప్ర‌భాక‌ర్ ఇందులో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. పూజా జ‌వేరి క‌థానాయిక‌. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంతో జరుగుతోంది. వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది​.​

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved