pizza
Sambho Sankara on 29 June
ఈనెల 29న `శంభో శంక‌ర‌` గ్రాండ్ రిలీజ్‌
You are at idlebrain.com > news today >
Follow Us

18 June 2018
Hyderabad

క‌మెడియ‌న్లు హీరోలుగా క్లిక్క‌యితే ఆ లెక్కే వేరు. అలీ- య‌మ‌లీల‌, సునీల్ - అందాల రాముడు, మ‌ర్యాద రామ‌న్న‌, శ్రీ‌నివాస‌రెడ్డి- గీతాంజ‌లి, స‌ప్త‌గిరి- స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్ .. బాక్సాఫీస్ వ‌ద్ద అద్భుత విజ‌యం సాధించిన ఈ చిత్రాల‌న్నీ క‌మెడియ‌న్ ట‌ర్న్‌డ్ హీరో సినిమాలే. ఇప్పుడు అదే కోవ‌లో వ‌స్తున్న మ‌రో చిత్రం `శంభో శంక‌ర‌`. ష‌క‌ల‌క శంక‌ర్‌ని హీరోగా, శ్రీధ‌ర్‌ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ఆర్. ఆర్. పిక్చ‌ర్స్ సంస్థ, ఎస్.కె. పిక్చ‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో వై. ర‌మ‌ణారెడ్డి, సురేష్ కొండేటి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్ర‌మిది.

నిర్మాత ర‌మ‌ణారెడ్డి మాట్లాడుతూ-``ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలకు అద్భుత‌ స్పందన లభించింది. టీజ‌ర్‌ 50లక్షల వ్యూస్ వైపు దూసుకెళుతోంది. ఒక స్టార్ హీరో టీజ‌ర్‌కి త‌గ్గ‌ని ధ‌మాకా రిజ‌ల్ట్‌ ఇది. దిల్‌రాజు వంటి అగ్ర‌నిర్మాత కం పంపిణీదారుడు ఈ సినిమా టీజ‌ర్‌ని ప్ర‌శంసించారంటే ఫ‌లితం ముంద‌స్తుగానే ఊహించ‌వ‌చ్చు. ప‌రిశ్ర‌మ‌లో పాజిటివ్ టాక్ వినిపించ‌డం ఉత్సాహం నింపుతోంది. ఈ చిత్రాన్ని ఈ నెల 29న ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్యంత భారీగా రిలీజ్ చేస్తున్నాం`` అని అన్నారు.

మ‌రో నిర్మాత‌ సురేష్ కొండేటి మాట్లాడుతూ -``ష‌క‌ల‌క శంక‌ర్ క‌థానాయ‌కుడిగానూ నిరూపించుకునే ప్ర‌య‌త్న‌మిది. తొలి ప్ర‌య‌త్న‌మే పెద్ద స‌క్సెస్ అవుతాడ‌న్న ధీమా ఉంది. టీజ‌ర్‌కి వ‌చ్చిన హైప్ దృష్ట్యా ఈ చిత్రాన్ని అత్యంత ఘ‌నంగా రిలీజ్ చేస్తున్నాం. 29న రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. శంక‌ర్‌తో పాటు న‌టీన‌టులంద‌రూ అద్భుతంగా లీన‌మై న‌టించారు. అంద‌రికీ ఇదో కీల‌క‌మ‌లుపునిచ్చే సినిమా అవుతుంది`` అన్నారు.

షకలక శంక‌ర్, కారుణ్య నాగినీడు, అజ‌య్ ఘోష్, ర‌వి ప్రకాష్, ప్ర‌భు, ఏడిద శ్రీరామ్ త‌దిత‌రులు న‌టించారు. ఈ చిత్రానికి కెమెరా: రాజ‌శేఖ‌ర్, సంగీతం: సాయి కార్తిక్, ఎడిటింగ్: ఛోటా.కె. ప్ర‌సాద్, నిర్మ‌తలు: వై. ర‌మ‌ణారెడ్డి, సురేష్ కొండేటి, క‌థ‌, స్ర్కీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: శ్రీధ‌ర్. ఎన్.

 

 

 


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved