pizza
Sarabha new schedule details
విజువల్ వండర్ గా ‘శరభ’...కొత్త షెడ్యూల్ ప్రారంభం
You are at idlebrain.com > news today >
Follow Us

5 June 2016
Hyderaba
d

జయప్రదగారు ప్రధాన పాత్రలో ఆకాష్ సహదేవ్ మరియు మిస్తి చక్రవర్తి జంటగా ఎన్.నరసింహారావు దర్శకత్వంలో ఎ.కె.ఎస్ ఎంటర్ టైనెంట్స్ పతాకంపై నిర్మాతలు అశ్వినికుమార్ సహదేవ్ మరియు గిరీష్ కపాడియా సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "శరభ". శనివారం ఈ సినిమా నూతన షెడ్యూల్ ప్రారంభమైంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అశ్విన్ కుమార్ సహదేవ్ మాట్లాడుతూ.. "ఒక సరికొత్త కథాంశంతోఅత్యున్నత సాంకేతిక విలువలతోభారీ తారాగణంతో నిర్మించబడుతున్న మా "శరభచిత్రీకరణ శరవేగంగా పూర్తవుతుంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ జూన్ 4 నుండి ప్రారంభం అయ్యింది. ఈ షెడ్యూల్ లో హై టెక్నికల్ వాల్యూస్ తో, విజువల్ ఎఫెక్ట్స్ తో సినిమాను రూపొందిస్తున్నాం. బాహుబలి, రోబో తరహాలో భారీ బడ్జెట్ తో ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమాను అత్యధ్భుతమైన విజువల్గా ఎఫెక్ట్స్ తో చిత్రీకరిస్తున్నాం. ఫైర్ ఫ్లై కంపెనీ వారు ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ ను అందిస్తున్నారు. ఇప్పటి వరకు చూడని విజువల్ ఎఫెక్ట్స్ తో విన్నూతనంగా సినిమాను రూపొందిస్తున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని వీలైనంత త్వరగా సినిమాను ప్రేక్షకులను తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు. 

జయప్రదఆకాష్ సహదేవ్మిష్టీ చక్రవర్తినెపోలియన్నాజర్షాయాజీ షిండేపునీత్ ఇస్సార్చరణ్ దీప్ఎల్.బి.శ్రీరాంపృథ్వీరాజ్తనికెళ్ళ భరణిరఘుబాబుజబర్ దస్త్ రాజేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రాసినిమాటోగ్రఫీ: రమణ సాల్వసంగీతం: కోటిఆర్ట్: కిరణ్ కుమార్ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావుకో ప్రొడ్యూసర్: సురేష్ కపాడియానిర్మాత: అశ్వనీ కుమార్ సహదేవ్కథస్క్రీన్ ప్లేదర్శకత్వం: ఎన్.నరసింహారావు.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved