pizza
Seethamma Andalu Ramayya Sitralu in Post Production Work
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ‘సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు’
You are at idlebrain.com > news today >
Follow Us

17 November 2015
Hyderabad

ఉయ్యాల జంపాలా, సినిమా చూపిస్త మామ చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాందించుకున్న రాజ్ తరుణ్ ప్రస్తుతం నటించిన ‘కుమారి 21 ఎఫ్’ చిత్రం విడుదలకు సిద్ధం గా వుంది. ఈ సినిమా తర్వాత రాజ్ తరుణ్ నటిస్తున్న చిత్రం ‘సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు’. శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో శ్రీశైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి పూర్ణిమ ఎస్‌బాబు సమర్పణలో ఎస్.శైలేంద్రబాబు, కెవీ శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తిచేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది.

ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలను తెలియజేస్తూ.. ‘ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో సున్నితమైన భావోద్వేగాలకు, వినోదానికి పెద్ద పీటవేశాం. రాజ్‌తరుణ్ పాత్ర సరికొత్తగా వుంటుంది. ఈ చిత్రం ద్వారా అర్తన అనే నూతన హీరోయిన్ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం కాబోతుంది. నవ్యమైన కథ, కథనాలతో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తిచేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నెలాఖరుకి పాటలు విడుదల చేసి, సినిమాను డిశంబర్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము. ప్రస్తుతం మా హీరో రాజ్‌తరుణ్ నటించిన ‘కుమారి 21 ఎఫ్’ విడుదలకు సిద్ధంగా వుంది. ఆ సినిమా టీం కి, మా హీరో కి.. అల్ ది బెస్ట్...’ అని తెలిపారు.

రాజ్‌తరుణ్, అర్తన, రణధీర్, రాజా రవీంద్ర, ఆదర్శ్, షకలక శంకర్, మధునందన్, విజయ్, జోగినాయుడు, సురేఖావాణి, శ్రీలక్ష్మి, హేమ, రత్నసాగర్, నవీన్, భార్గవి తదితరలు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, పాటలు: సుద్ధాల అశోక్‌తేజ, రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, వనమాలి, కృష్ణచైతన్య, ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్, కెమెరా: విశ్వ, ప్రొడక్షన్ కంట్రోలర్: కొర్రపాటి వెంకటరమణ, సమర్పణ; శ్రీమతి పూర్ణిమ ఎస్‌బాబు, కథ-స్కీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: శ్రీనివాస్ గవిరెడ్డి.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved