pizza
Sekhar Kammula’s new film launched
శేఖర్ కమ్ముల కొత్త సినిమా షురూ..
You are at idlebrain.com > news today >
Follow Us

12 November 2018
Hyderabad

 

శేఖర్ కమ్ముల కొత్త సినిమా షురూ..

‘‘ఫిదా’’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత స్టార్ డైరెక్టర్ శేఖర్ క‌మ్ములచేయ‌బోయే కొత్త సినిమా మొదలైంది..గ‌తంలో త‌న సినిమాల ద్వారా ఎంతో మందిహీరోహీరోయిన్ల‌ను ప‌రిచ‌యం చేసిన శేఖ‌ర్ క‌మ్ముల త‌న త‌ర్వాతి సినిమాలోకూడా అంతా కొత్తవాళ్లనే నటింపజేయనున్నాడు. రొమాంటిక్ మ్యూజికల్ లవ్స్టోరీ గా తెర‌కెక్కనున్న ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్టు, క్లాప్ బోర్డ్పూజ కార్యక్రమాలు సోమవారం సికింద్రాబాద్ లోని గ‌ణేష్ ఆల‌యంలో జ‌రిగాయి. ఈకార్యక్రమంలో దర్శకుడు శేఖర్ కమ్ముల తో పాటు నిర్మాతలు సునీల్ నారంగ్,పి.రామ్మోహన్,కో ప్రొడ్యూసర్ విజయ్ భాస్కర్,భరత్ నారంగ్,సదానంద్పాల్గొన్నారు.. ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ అంతా పూర్తి చేసుకున్న ఈ మూవీరెగ్యులర్ షూటింగ్ డిసెంబ‌ర్ లో మొదలు కానుంది.. ఈ సినిమా ద్వారా ప్రముఖడిస్ట్రిబ్యూషన్ సంస్థ ‘‘ఏషియ‌న్ గ్రూప్’’ నిర్మాణ రంగంలోఅడుగుపెడుతోంది.నటీనటులు,మిగతా సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోతెలియజేస్తారు. అమిగోస్ క్రియేషన్స్ స‌మ‌ర్ప‌ణ‌లో తెరకెక్కబోయే ఈప్రేమక‌థ‌కునిర్మాత‌లు నారాయ‌ణ దాస్ నారంగ్ , పి. రామ్మోహ‌న్ (FDCChairman). కో ప్రొడ్యూస‌ర్-విజ‌య్ భాస్క‌ర్‌, రచన,దర్శకత్వం:శేఖర్కమ్ముల

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved