pizza
Shweta Menon in She
You are at idlebrain.com > news today >
Follow Us

20 October 2015
Hyderabad

'షీ'గా శ్వేత మీనన్

హీరోయిన్ శ్వేత మీనన్ (రాజన్న ఫేం) తెలుగులో 'షీ'గా రాబోతోంది. కల్వకుంట్ల తేజేశ్వర్ రావు (కన్నారావు) నిర్మాతగా మహేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై పర్స రమేష్ మహేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ 'షీ' (ఈజ్ వెయిటింగ్). ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న శ్వేత మీనన్ పై తాజాగా ఫోటోషూట్ చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత కల్వకుంట్ల తేజేశ్వర్ రావు (కన్నారావు) మాట్లాడుతూ.. 'అతి త్వరలో ఒక మంచి సేవా కార్యక్రమంతో ఈ చిత్రాన్ని భారీగా ప్రారంభిస్తామని తెలిపారు. నవంబర్, డిసెంబర్ కల్లా చిత్ర షూటింగ్ పూర్తి చేసి మార్చిలో సినిమాను విడుదల చేస్తామన్నారు.

సినిమాలో హీరోతో పాటు మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు తెలిపారు.

కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం - పర్స రమేష్ మహేంద్ర
నిర్మాత: కల్వకుంట్ల తేజేశ్వర్ రావు (కన్నారావు)

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved