pizza
Sheik Dawood about Thikka
హీరో సాయిధరమ్‌తేజ్ తో వర్క్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. 'తిక్క' కథ,స్క్రీన్ ప్లే రచయిత షేక్ దావూద్
You are at idlebrain.com > news today >
Follow Us

10 August 2016
Hyderaba
d

నా పేరు షేక్ దావూద్,చెన్నై లో పుట్టి పెరిగిన నేను సినిమాల పై ఉన్న ప్రేమతో ఆస్ట్రేలియా లో ఫిలిం డిప్లొమా కోర్సు చేసి, సొంతంగా ఒక యాడ్ ఏజెన్సీ ని పెట్టుకుని 50 కి పైగా యాడ్ ఫిలిమ్స్ తీశాను.కాకపోతే సినిమాలకు స్క్రీన్ ప్లే చెయ్యాలనే డెసిషన్ తో ట్రైల్స్ లో ఉన్న నాకు కృష్ణ వంశీ గారు పిలిచి మొగుడు సినిమాకి స్క్రీన్ ప్లే చేసే అవకాశం ఇచ్చారు.ఆ తరువాత వెంకటాద్రి ఎక్స్ ప్రెస్,ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలకు కూడా స్క్రీన్ ప్లే విభాగంలో పని చేశాను.అయితే ప్రస్తుతం తిక్క సినిమాకి కథ,స్క్రీన్ ప్లే అందించడం నా అదృష్టం గా భావిస్తున్నాను.ఒక కొత్తదనం ఉన్న,డిఫరెంట్ కథని అర్ధం చేసుకుని,ఒప్పుకుని నన్ను ఎంకరేజ్ చేసిన మా హీరో సాయి ధరమ్ తేజ్ గారికి,అలాగే మా ప్రొడ్యూసర్ రోహిణి రెడ్డి గారికి,నా కథని చాలా గొప్పగా స్క్రీన్ మీదకు తీసుకువచ్చిన దర్శకుడు సునీల్ రెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.తిక్క సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ కి,నటించిన నటీనటులు అందరికి కూడా థాంక్స్ అండ్ కంగ్రాట్స్.నా గత సినిమాల లానే ఈ సినిమాని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని,మాకు అఖండ విజయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను. మీడియా మిత్రులను సపోర్ట్ చెయ్యమని కోరుతున్నాను.అలాగే టాలెంట్ కి పట్టం కట్టే తెలుగు ఇండస్ట్రీ నా మీద చూపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ,ఇక పై కూడా నన్ను ఆశీర్వదిస్తారని ఆశిస్తూ,సపోర్ట్ చెయ్యమని ప్రార్ధిస్తూ మీ షేక్ దావూద్.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved