pizza
Celebrities tribute to Sirivennela Seetharama Sasthri
You are at idlebrain.com > news today >
Follow Us

1 December 2021
Hyderabad

సాహితీ హిమాలయం సీతారాముడు.
- ఇళయరాజా

వ్యాపారాత్మక సినిమా పాటల్లో సైతం.. కళాత్మకతని, కవితాత్మని అందించి..తనదైన ముద్రతో
అందమైన, అర్థవంతమైన,
సమర్థవంతమైన పాటలని
మన మెదళ్లలోకి జ్ఞానగంగలా ప్రవహింపచేసిన కవీశ్వరుడు సీతారాముడు..
ఎన్నో వత్సరాల ప్రయాణం మాది, శ్రీ వేటూరి గారికి సహాయకుడిగా వచ్చి...అతి తక్కువ కాలంలో..శిఖర స్థాయికి చేరుకున్న సరస్వతీ పుత్రుడు...
మా ఇద్దరి కలయికలో ఎన్నో పాటలు ప్రాణం పోసుకున్నాయి..తన పాటల "పదముద్రలు " నా హార్మోనియం మెట్లపై నాట్యం చేశాయి... రుద్రవీణ, స్వర్ణకమలం, బొబ్బిలిరాజా
ఎన్ని సినిమాలు, ఎన్ని పాటలు...రేపు రాబోయే
" రంగమార్తాండ " కూడా..
సీతారాముడు రాసిన పాటలకు నువ్వా నేనా అంటూ పోటీపడుతూ సంగీతాన్ని అందించిన సందర్భాలెన్నో.....!!
సీతారాముడు
పాటతో ప్రయాణం చేస్తాడు
పాటతో అంతర్యుద్ధం చేస్తాడు..
పాటలో అంతర్మథనం చెందుతాడు...
పాటని ప్రేమిస్తాడు..
పాటతో రమిస్తాడు..
పాటని శాసిస్తాడు..
పాటని పాలిస్తాడు.. పాట నిస్తాడు....
మన భావుకతకి భాషను అద్ది. మనకు తెల్సిన పాటలా చెవుల్లోకి ఒంపుతాడు... అందుకే
సీతారాముడి పాటలు ఎప్పటికీ గుర్తుంటాయి..
తన సాహిత్యం
నాతో ఆనంద తాండవం చేయించాయి
నాతో శివ తాండవం చేయించాయి..
"వేటూరి"
నాకు తెలుగు సాహిత్యం మీద ప్రేమను పెంచితే...
"సీతారాముడు"
నాకు తెలుగు సాహిత్యం మీద గౌరవాన్ని పెంచాడు..
ధన్యోస్మి మిత్రమా..!!
ఇంత త్వరగా సెలవంటూ
శివైక్యం చెందడం మనస్సుకు బాధగా ఉంది..
" పాటకోసమే బ్రతికావు,
బ్రతికినంత కాలం పాటలే రాసావు....
ఆ ఈశ్వరుడు నీకు సద్గతిని ప్రసాదించాలని కోరుకుంటున్న...

...........🙏ఇళయరాజా


నడిచి వచ్చే నక్షత్రంలా ఆయన స్వర్గద్వారాల వైపు సాగిపోయారు. మనకి ఆయన సాహిత్యాన్ని కానుకగా ఇచ్చి వెళ్లారు. మిత్రమా ... will miss you FOREVER !

- Chiranjeevi


తెలుగు సాహిత్యానికి శ్రీ సీతారామ శాస్త్రి గారి మరణం తీరని లోటు - Pawan Kalyan

వాగ్దేవి వరప్రసాదంగా మన తెలుగునాట నడయాడిన విద్వత్కవి శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. బలమైన భావాన్ని... మానవతావాత్వాన్ని... ఆశావాదాన్ని చిన్నచిన్న మాటల్లో పొదిగి జన సామాన్యం గుండెల్లో నిక్షిప్తం చేసేలా గీత రచన చేసిన అక్షర తపస్వి శ్రీ శాస్త్రి గారు. తెలుగు పాటను కొత్త పుంతలు తొక్కించిన ఆ మహనీయుడు ఇకలేరు అనే వాస్తవం జీర్ణించుకోలేనిది. అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన శాస్త్రి గారు కోలుకొంటారు అని భావించాను. ఇంతలోనే ఈ విషాద వార్త వినాల్సి వచ్చింది. శ్రీ సీతారామశాస్త్రి గారు మరణం కేవలం సినీ పరిశ్రమకే కాదు... తెలుగు సాహితీ లోకానికి తీరని లోటు. వారిని కేవలం సినీ గీత రచయితగా చూడలేము. ఆయన ఏ పాట రాసినా అందులో సాహిత్యం నిక్షిప్తమై ఉంటుంది. నేను నటించిన సుస్వాగతంలో ‘ఏ స్వప్న లోకాల సౌందర్య రాశి..’ పాట కావచ్చు, ‘తొలిప్రేమ’లో ‘ఈ మనసే..’ పాటల్లో అలతి అలతి పదాలతో ప్రేమ భావనలు చెప్పారు. ప్రేమ గీతాలు, అల్లరి పాటలు.. ఏవైనా అంతర్లీనంగా మంచి చెప్పాలని తపించేవారు. ఒక కవిగా సమాజాన్ని నిలదీసి, బాధ్యతలు గుర్తు చేసేవారు. ‘నిగ్గదీసి అడుగు...’, ‘అర్థ శతాబ్దపు అజ్ఞానాన్ని..’ లాంటి పాటలు వింటే సమాజాన్ని నిత్యచైతన్యంగా ఉంచాలని శ్రీ శాస్త్రి గారు ఎంత తపించారో అర్థం అవుతుంది. ‘ఎవరో ఒకరు ఎపుడో అపుడు...’, ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి..’ లాంటి పాటల్లో ఆశావాదాన్ని అందించారు. భావితరాలకు మన తెలుగు సాహితీ సంపదను వారసత్వంగా ఇవ్వాలని తపించేవారు.  శాస్త్రి గారి రచనల్లోని వైవిధ్యాన్ని చూస్తే ఆయన కలానికి ఎన్ని పాళీలో అనిపిస్తుంది.
శ్రీ సీతారామ శాస్త్రి గారి మరణం వ్యక్తిగతంగా నాకు కూడా ఎంతో లోటు. నాపట్ల ఎంతో అప్యాయతను కనబరిచేవారు. వారితో మాట్లాడితే - సాహిత్యం, ఆధ్యాత్మికం నుంచి అభ్యుదయ వాదం, సామ్యవాదం వరకూ ఎన్నో అంశాల గురించి కూలంకషంగా చెప్పేవారు. శ్రీ శాస్త్రి గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, సద్గతులు ప్రాప్తించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.


Deeply saddened by the loss of lyrical genius Sirivennela Seetharama Sastry garu. My thoughts and prayers are with the family during this difficult time. Rest in peace sir.. You will be terribly missed

- Mahesh Babu


సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇక లేరు అనే వార్త నన్ను తీవ్ర మనస్థాపానికి గురిచేసింది. అలుపెరుగక రాసిన ఆయన కలం నేడు ఆగినా, రాసిన అక్షరాలు తెలుగు భాష ఉన్నంత కాలం అందరికీ చిరస్మరణీయంగా నిలిచివుంటాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని మనసారా ప్రార్థిస్తున్నాను.

- Jr. NTR


సినిమా పాట‌కు సాహిత్య గౌర‌వాన్ని క‌లిగించిన వ్య‌క్తి సిరివెన్నెల గారు - నంద‌మూరి బాల‌కృష్ణ‌

తెలుగు పాట‌ని త‌న సాహిత్యంతో ద‌శ‌దిశ‌ల వ్యాపింప‌జేసిన ప్ర‌ముఖ గేయ ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ‌శాస్త్రిగారు నాకు ఎంతో ఆప్తులు. నేను న‌టించిన చిత్రాల‌కు వారు అద్భుత‌మైన పాట‌లు రాయ‌డం జ‌రిగింది. సినిమా పాట‌కు సాహిత్య గౌర‌వాన్ని క‌లిగించిన వ్య‌క్తి సిరివెన్నెల గారు. ఆయ‌న‌ ఈ రోజు మ‌న మ‌ధ్య లేక‌పోవ‌డం చాలా భాధాక‌రం. వారి ప‌విత్ర ఆత్మ‌కు శాంతి చేకూర్చాల‌ని ఆ భ‌గ‌వంతున్ని కోరుకుంటూ.. వారి కుంటుంభ స‌భ్యుల‌కు నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను - నంద‌మూరి బాల‌కృష్ణ‌


You have left us with such beautiful words and songs Seetharama Sastry Garu which will live forever!! May your soul rest in peace

- Nagarjuna Akkineni


Disheartened to hear that Sirivennela Seetharama Sastry garu is no more. Deepest condolences to his loved ones. May his soul rest in peace.

- Venkatesh Daggubati


మాది 35 ఏళ్ల అనుబంధం...
నాది మాటలకు అందని బాధ - 'సిరివెన్నెల' గురించి ప్రముఖ నిర్మాత 'స్రవంతి' రవికిశోర్

నిర్మాతగా తన తొలి సినిమా 'లేడీస్ టైలర్' నుంచి లేటెస్ట్ 'రెడ్' వరకూ... తమ సంస్థలో సుమారు 80 పాటల వరకూ 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి రాశారని నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ అన్నారు. ఆయన మరణం వ్యక్తిగతంగా తనకెంతో లోటు అని, ఏం చెప్పాలో తెలియడం లేదని, తనకు మాటలు రావడం లేదని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. తన పెద్దన్నయ్యను కోల్పోయినట్టు ఉందని రవికిశోర్ అన్నారు.

'స్రవంతి' రవికిశోర్ మాట్లాడుతూ "ఏం చెప్పాలో తెలియడం లేదు. మాటలకు అందని బాధ ఇది. అన్నయ్యతో అనుబంధం ఈనాటిది కాదు. నిర్మాతగా నా తొలి సినిమా 'లేడీస్ టైలర్'లో అన్ని పాటలూ ఆయనే రాశారు. అప్పటి నుంచి సీతారామశాస్త్రి గారితో పరిచయం ఉంది. అప్పటి నుంచి మా ప్రయాణం కంటిన్యూ అవుతోంది. బహుశా... ఏ నిర్మాతకూ రాయనన్ని పాటలు మా సినిమాకు రాశాడని చెప్పవచ్చు. 'మహర్షి', 'ఏప్రిల్ 1 విడుదల', 'మావిచిగురు', 'ఎగిరే పావురమా', 'నువ్వు నాకు నచ్చావ్', 'నువ్వే కావాలి', 'నువ్వే నువ్వే', 'ఎలా చెప్పను', 'గౌరీ', 'నేను శైలజ', 'రెడ్'... దాదాపుగా నేను నిర్మించిన అన్ని సినిమాల్లోనూ ఆయన పాటలు రాశారు. ఎక్కడో ఒకటి అరా పాటలు వేరేవాళ్లు రాశారు తప్పితే... ఎక్కువ సినిమాలకు ఆయనదే సింగిల్ కార్డ్. స్రవంతి మూవీస్ సంస్థలో సుమారు 80 పాటల వరకూ రాసి ఉంటారు. ఆయనతో మ్యూజిక్ సిట్టింగ్స్, రైటింగ్ సిట్టింగ్స్ కు కూర్చున్న సందర్భాలు ఉన్నాయి. ఒక్కో పాట రాయడానికి ఐదారు రాత్రులు కూర్చునే వాళ్ళం. ఇంకా ఏదో రాయాలని ఆయన పరితపించేవారు. ఇది వరకు... పాట అంటే నాలుగైదు సన్నివేశాల్లో చెప్పాల్సిన సారాన్ని చెప్పేవాళ్లం. అందులో ఆయన మేటి. రామ్ హీరోగా నిర్మించిన 'రెడ్'లో ఆయన పాటలు రాశారు. అప్పుడు డిసెంబర్ 2019లో ఆ పాటల కోసం రాత్రుళ్లు కూర్చున్నాం. ఆ తర్వాత కరోనా వచ్చాక కలవడం కుదరలేదు. నాకంటే ఆయన రెండు నెలలు పెద్దవారు. అందుకని, నన్ను 'కుర్రకుంక' అని సరదాగా అనేవారు. నేను రాముడు అని పిలిచేవాడిని. సాయంత్రం మా ఆఫీసుకు వస్తే సరదాగా కూర్చుని కబుర్లు చెప్పుకొనేవాళ్లం. ఆయన ఆరోగ్యం గురించి మొన్న ఒకరితో మాట్లాడితే... త్వరలో ఆరోగ్యంగా తిరిగి వస్తారని అన్నారు. ఇంతలో ఇటువంటి విషాద వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదు" అని అన్నారు.

'రెడ్' సినిమా పాటలు రాసేటప్పుడు జరిగిన సంఘటన గురించి 'స్రవంతి' రవికిశోర్ మాట్లాడుతూ "వారం రోజుల్లో 'రెడ్' సినిమాలో సాంగ్ షూటింగ్ అనగా... పాట రెండు రోజుల్లో రాసి ఇచ్చేస్తానని అన్నారు. కథ మొత్తం విని... 'ఈ కథకు ఈ పాట కరెక్ట్ కాదు. నేను రాసినా, మీరు చిత్రీకరించినా... ఆ తర్వాత తీసేస్తారు' అని చెప్పారు. దాంతో మేం ఆ పాటను తీసేశాం. అలా ఎవరు చెబుతారు చెప్పండి? డబ్బులు చూసుకుంటారు తప్ప, పాట వద్దని ఎవరంటారు? ఇటువంటి సంఘటనలు మా మధ్య చాలా జరిగాయి. మా మధ్య సుమారు 400 రాత్రులు సాహిత్య చర్చలు జరిగాయి" అని అన్నారు.


కాలం సిరివెన్నెల ని తీసుకెళ్లగలదు కానీ ఆయన కలం నుంచి వచ్చిన మాట కి, పాట కి మరణం ఎక్కడిది... తెలుగు భాష ఉన్నంత కాలం సిరివెన్నెల గారు పాటలతో నింపిన స్ఫూర్తి ప్రతీ ఒక్కరి మదిలో కదులుతూనే ఉంటుంది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.

- K Raghavendra Rao


తెలుగు సినిమా ఉన్నన్ని రోజులు సిరివెన్నెల బతికే ఉంటారు : నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌

సిరివెన్నెల సీతారామ‌శాస్త్రితో చాలా ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. ఆయ‌న‌తో ఎన్నో తీపి జ్ఞాప‌కాలున్నాయి. అన్న అని ఎంతో ఆప్యాయంగా పిలిచేవాడు. మా బ్యాన‌ర్‌లో రూపొందించిన సినిమాల్లోని కొన్ని అద్భుత‌మైన పాట‌ల‌కు ఆయ‌న త‌న సాహిత్యంతో ప్రాణం పోశారు. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కే కాదు.. సాహిత్యానికి ఆయ‌న చేసిన సేవ‌లు మ‌రచిపోలేం. ఆయ‌న త‌న క‌లం ప‌దునుతో తెలుగు సినీ ప్ర‌స్థానంలో త‌న‌దైన ముద్ర వేశారు. ఎంతో మంది యువ ర‌చ‌యిత‌ల‌కు ఆయ‌న రైట‌ర్‌గా స్ఫూర్తినిచ్చారు. అలాంటి మంచి రైట‌ర్‌, మ‌న‌సున్న వ్య‌క్తి.. నా సోద‌ర స‌మానుడు ఈరోజు లేర‌నే నిజం ఎంతో బాధ‌ను క‌లిగిస్తుంది. ఈరోజు ఆయ‌న మ‌న మ‌ధ్య లేరేమో కానీ తెలుగు సినిమా ఉన్న‌న్ని రోజులు ఆయ‌న బ‌తికే ఉంటారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు నా ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్నాను.

- నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్


'సిరివెన్నెల' సీతారామశాస్త్రిగారి లాంటి వారు అరుదుగా జన్మిస్తారు - ప్రముఖ దర్శక నిర్మాత ఎం.ఎస్. రాజు

'సిరివెన్నెల' సీతారామశాస్త్రిగారితో తన స్నేహం సినిమాలకు సంబంధం లేనిదని ప్రముఖ దర్శక నిర్మాత ఎం.ఎస్. రాజు తెలిపారు. తన కుటుంబ సభ్యుడ్ని కోల్పోయినట్టు ఉందని ఆయన అన్నారు. తామిద్ద‌రం రెగ్యుల‌ర్‌గా ట‌చ్‌లో ఉండేవాళ్ల‌మ‌ని, ఆయ‌న చివ‌రి చూపు ద‌క్క‌లేద‌నే బాధ‌లో ఉన్నాన‌ని ఆయన ఆవేదన చెందారు. సిరివెన్నెలతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రాజు మాట్లాడుతూ "సుమంత్ ఆర్ట్స్ సంస్థ స్థాపించక ముందు... అర్జున్ హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో, నేనూ ఓ నిర్మాణ భాగస్వామిగా 'మనవడొస్తున్నాడు' సినిమా తీశా. అందులో 'సిరివెన్నెల' గారు పాటలు రాశారు. అప్పుడే ఆయన పరిచయమయ్యారు. అందులో 'చెరుకు చేను చాటు ఉంటే...' అనే పాట రాయడం నాకు ఇప్పటికీ గుర్తుంది. అప్పుడు నా వయసు 25, 26 ఏళ్లు ఉంటాయి. తర్వాత నేను సుమంత్ ఆర్ట్స్ స్థాపించాను. 'శత్రువు'లో 'పొద్దున్నే పుట్టిందీ చందమామ' పాట ఆయనే రాశారు. తర్వాత 'మనసంతా నువ్వే'కి రీ-కనెక్ట్ అయ్యాం. అందులో మొత్తం పాటలన్నీ ఆయనే రాశారు. అన్నీ అద్భుతమైన పాటలే. ఆ పాటలు రాసేటప్పుడు ఎన్నో రాత్రులు మేమిద్దరం కూర్చున్నాం. నన్ను ఎదురుగా కూర్చోమనేవారు. నేను కూర్చుంటే... ఆలోచనల పక్షిలా ఎక్కడెక్కడికో ఎగురుతూ, ప్రపంచం అంతా తిరిగొచ్చినట్టు వచ్చేసి పాటలా నాకు ఇచ్చేసేవారు. ఆ ఎక్స్‌పీరియ‌న్స్ అంతా ఓ అద్భుతం. ఆయన విసుక్కోవడం నేను చూడలేదు. 'శాస్త్రిగారు... మరో వెర్షన్ కావాలి' అంటే వెంటనే రాసి ఇచ్చేవారు. ఏదో రాశామంటే రాశాం అన్నట్టు కాకుండా... నా ప్రతి సినిమా కథను షాట్‌తో సహా వినేవారు. కథకు తగ్గట్టు భావం వచ్చేలా పాటలు రాసేవారు. ఆయన రాసిన ప్రతి పాట శాశ్వతమే. అంత గొప్ప పాటలు రాసిన ఆయనకు అప్పట్లో తక్కువ రెమ్యునరేషన్ ఉండేది. ఆయన రెమ్యునరేషన్ పెంచింది కూడా నేనే. చాలా మంది అనవసరంగా పెంచుతున్నావని నన్ను అన్నారు. 'నేను ఇండస్ట్రీ బాగు కోసమే ప్రయత్నిస్తున్నా. అందుకే, ఇలా పెంచాను. పాట సృష్టికర్తను గౌరవించుకోవడం మన బాధ్యత' అని చెప్పాను. ఆయన ఎన్నో ఉన్నతమైన పాటలు రాశారు. వ్యక్తిగానూ ఉన్నతమైన మనిషి. అటువంటి వ్యక్తులు అరుదుగా జన్మిస్తారు. ఇప్పుడు ఆయన మనమధ్య లేరంటే ఎంతో బాధగా ఉంది. ఆయన చివరి చూపు దక్కలేదనే వెలితి ఉంది. కరోనా వల్ల ఈమధ్య కలకవలేకపోయా. మా అనుబంధం చాలా విలువైనది. నా మనసులో ఆయన స్థానం ఎప్పటికీ చెక్కు చెదరదు. చిత్ర పరిశ్రమకూ ఆయన మరణం పెద్ద లోటు. చాలా కోల్పోయినట్టే. సిరివెన్నెల లాంటి వ్యక్తులు మళ్లీ పుట్టరని తెలుసు. కలవడమో... ఫోనులో మాట్లాడుకోవడమో... మేం రెగ్యులర్ గా టచ్ లో ఉండేవాళ్లం. సినిమాలకు సంబంధం లేని స్నేహం మాది. పాట కోసం రాత్రుళ్లు ఎందుకింత కష్టపడుతున్నారని నేను అంటే నవ్వేసేవారు. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సినిమాలో 'ఆకాశం తాకేలా...' పాట ఉంది. ఆయన బిజీగా ఉండి రాయడం కుదరలేదు. 'నువ్వు షూట్ చేసుకుని వచ్చేయ్' అన్నారు. సంగీత దర్శకుడు ఇచ్చిన బాణీకి అనుగుణంగా షూట్ చేసుకుని, ఎడిట్ చేసి ఆయన దగ్గరకు వెళితే... వెంటనే పాట రాసిచ్చారు. 'వర్షం' కథను విని... 'పాటల గురించి రెండు మూడు రోజుల్లో కూర్చుందాం' అని కారెక్కి వెళ్లిపోయారు. మళ్లీ ఫోన్ చేసి... 'హనీ! రెండు లైన్లు వచ్చాయి రాసుకో' అని 'ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వానా... ఎన్నాళ్లని దాక్కుంటావు పైన' అని చెప్పారు. సిరివెన్నెల పాట గురించి ఎంత ఆలోచిస్తారు? మథనపడతారు? అనేది చెప్పడానికి అది ఒక ఉదాహరణ మాత్రమే. ఎన్నో గొప్ప ప్రయోగాలు చేశారు" అని అన్నారు.


"సీతారామశాస్త్రిగారు తెలుగు సినిమాకు గొప్ప వరం. ఆయన లేకపోవడం ఏమిటి? అనిపిస్తోంది. ఎస్పీ బాలుగారు ఇప్పుడు మన మధ్య లేకపోయినా... ఆయన్ను గుండెల్లో పెట్టుకుని స్మరించుకుంటున్నాం. 'సిరివెన్నెల' సీతారామశాస్త్రిగారు కూడా అంతే! ఎప్పటికీ మన గుండెల్లో ఉండిపోతారు. నేను దర్శకత్వ శాఖలో పని చేసినప్పటి నుంచి ఆయనతో సాన్నిహిత్యం ఉంది. చాలా ఆత్మీయంగా పలకరించేవారు. 'చెన్నకేశవరెడ్డి'లో ఆయనతో పాటలు రాయించుకున్నాను. నా 'అదుర్స్' సినిమాలో కామెడీని ఆయన ఎంజాయ్ చేసేవారు. ఆయనతో గడిపిన క్షణాలను ఎప్పటికీ గుర్తు ఉంచుకుంటాను"

- దర్శకులు వీవీ వినాయక్.


సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఒక ఒక సాహిత్య పరిశోధకుడు అలియాస్ సైంటిస్ట్:

తాను చదువుకున్న అనంతమైన సాహిత్యపు సారాన్ని మరియూ జీవితం పట్ల తనకున్న అపారమైన అవగాహనని మేళవించి.. రాసే ప్రతిపదం వెనుక ఎంతో గాఢమైన, లోతైన సారాన్ని, జ్ఞానాన్ని సందర్భోచితంగా నింపుతూ.. ప్రతి పాటని ఒక తపస్సులా, తన సొంత బిడ్డలా భావిస్తూ.. పండితులను పామరులను ఏకకాలంలో ఆకట్టుకుని కట్టిపడేసే ఒక సాహిత్యపు నిత్యాన్వేషి, నిరంతర పరిశోధకుడు (Lyrical Scientist) అయిన ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి’గారు అకాల మరణం చెందటం.. తెలుగు చలన చిత్ర పరిశ్రమ చేసుకున్న దురదృష్టం. ఆయనతో, ఆయన బిడ్డలతో (పాటలతో) మరియూ ఆయన కుటుంబ సభ్యులతో ఆత్మీయ పరిచయం కలగటం నేను చేసుకున్న అదృష్టం. నా దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి’, ‘సీతారామరాజు’ మరియూ ‘లాహిరి లాహిరి లాహిరిలో’ సినిమాలలోని అన్ని పాటలను Solo/Single Card Lyricist గా.. ఆయనతో రాయించుకోగలిగిన అనుభవాన్ని పొందగలగటం.. నేను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ఆయన పాటల రూపంలో తెలుగు సాహిత్య ప్రియుల మధ్య ఎప్పటికీ జీవిస్తూనే ఉంటారని విశ్వసిస్తూ..

వై. వి. ఎస్‌. చౌదరి
30.11.2021.


His words, his songs and his magic will live forever.
ఆయన సాహిత్యం లోని సిరివెన్నెల మన మనసుల మీద ఎప్పటికీ అలానే వుంటుంది.
వీడుకోలు గురువు గారూ..

- Nani


HeartbrokenBroken heart

After my Father,he was d only 1 who wud scold,Correct or appreciate me rightfully

Wil miss U Dearest Uncle

Lov U & ThankU 4 all d Magical Lyrics dat decorated my Tunes & 4 Encouraging my Lyrics
U r Irreplaceable

- Devi Sri Prasad


ఇంకెక్కడి వెన్నెల తెలుగు పాటకు అమావాస్య ;

- Harish Shankar


కను మూసిన తరువాతనే.. పెను చీకటి చెబుతుందా !!! తెలుగు సినీ సాహిత్యానికి తీరని లోటు ఇది! ఎప్పుడూ.. ఎల్లప్పుడూ.. మీరు, మీ పాటలు మాతోనే జీవిస్తుంటాయి! We Miss you #SiriVennelaSeethaRamaSastry Gaaru! Rest In Peace Legend!

- Gopichand Malineni


"మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరీ వెనుకవచ్చు వాళ్ళాకు బాట అయినది ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు" - మహానుభావా…చిరస్మరణీయుడా…ఇక కనిపించవా?…మా గుండెల్లో నిద్రపోయావా?...విశ్వాత్మలో కలిసిపోయావా?

- Deva Katta


తెలుగు పాటకు పెద్ద దిక్కు,మహా కవి శ్రీ సీతారామశాస్త్రి గారు ఇక లేరు అన్న వార్తని నమ్మలేకపోతున్నా… ఈ రోజు తెలుగు సాహిత్యాభిమానులకు విషాదకరమైన రోజు. ఆయన రాసిన పాటలంటే నాకు ఎంతో ఇష్టం. తెలుగు పాటకు గౌరవాన్ని తీసుకు వచ్చిన గొప్ప రచయిత. సిరివెన్నెల గారికి నా అశ్రునివాళి
ఓం శాంతి

- Gopi Mohan


జగమంత కుటుంబం మీది
మీరు లేక
ఏకాకి జీవితం మాది...Folded hands. Unbearable loss thank you for the poetic perceptions which added meaning in to our lives .. YOU WERE THE BEST GURUJI #SirivennelaSitaramasastry garu #RIP

- Prakash Raj


మీ మాటలు, పాటలు విని కొన్ని దశాబ్దాలుగా ఎంతో ఆనందించాము Bouquetకానీ ఈ సమయంలో మీ గురించి ఎలా రాయాలో తెలియటం లేదు Sir! Folded handsFolded hands
My condolences to the family and loved ones..
You will forever be in our hearts through your art Sir
Legends live on! Sirivennela Seetharamasastry garu

- Sushanth A


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved