pizza
Size Zero Audio to be Released on the 1st of November
You are at idlebrain.com > news today >
Follow Us

24 October 2015
Hyderabad

Anushka Shetty starrer Size Zero-Sannajaji Nadumu is going to unveil its audio on the 1st of November. Producer PVP Cinema has announced that the foot tapping music composed by M M Keeravani is going to be a major highlight for this rom com and it will be released in a star studded event at Novotel HICC on Sunday the 1st of November at 6.30pm. Leading producers, directors, technicians, and actors are expected to attend this launch event.

The two teasers for Size Zero that were released last month have already become Internet sensations and raised the expectations for the movie. Anushka’s different look as opposed to her look in Bahubali and Rudramadevi and the glamour quotient of Sonal Chauhan and Arya have added to the buzz around Size Zero.

Size Zero is a light hearted take on the troubles faced by a large sized heroine. The Title song “Size Zero” has already been released and it has been steadily climbing up on to the top of the charts. M M Keeravani who is reputed for his soulful and emotional music is coming up with the music of Size Zero after the stupendous success of Bahubali.

Starring Anushka Shetty and Arya, Size Zero also has Sonal Chauhan, Prakash Raj, Urvashi, Gollapudi Maruti Rao and Master Barath in pivotal roles.

Directed by K S Prakash Rao and Produced by PVP Cinema, Size Zero-Sannajaji Nadumu has music by M M Keeravani and lyrics by Ananth Sriram, Nirav Shah is the DOP, Pravin Pudi is the Editor, Script by Kanika Dhillon Kovelamudi, Art by Anand Sai and Costumes by Prashanti.

With a tagline of The Biggest Entertainer—Size Zero-Sannajaji Nadumu music is going to rock from the 1st of November.

నవంబర్1న అనుష్క, ఆర్య కాంబినేషన్ లో పి.వి.పి బ్యానర్ భారీ చిత్రం ‘సైజ్ జీరో’ ఆడియో విడుదల

ఎన్నో సూపర్ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ ప్రొడక్షన్ నెం.10గా నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘సైజ్ జీరో’. ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు . ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ వంటి విలక్షణమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన స్టార్ హీరోయిన్ అనుష్క త్వరలోనే డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘సైజ్ జీరో’తో మన ముందుకు రానుంది. ఈ చిత్రం వెయిట్ లాస్ కి సంబంధించిన కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి విన్నూతమైన సబ్జెక్ట్ తో కమర్షియల్ వాల్యూస్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం అనుష్క దాదాపు ఇరవై కేజీల బరువు పెరిగింది. బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ‘సైజ్ జీరో’ సినిమా ప్రారంభం నుండి ప్రేక్షకుల్లో, సినీ అభిమానుల్లో భారీ క్రేజ్ ను క్రియేట్ చేసింది.

ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్స్, పోస్టర్స్ లో గ్లామర్ తో పాటు భిన్నమైన భారీ లుక్ తో ఉన్న అనుష్కను చూసి ఆమె మరో డిఫరెంట్ పాత్రలో కనిపించనుందని సినీ అభిమానులకు అర్థమైంది. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆడియో, సినిమా ఎలా ఉంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే ఆర్య స్టయిలిష్ లుక్స్ తో ఈ రొమాంటిక్ కామెడిలో దర్శనమిస్తున్నాడు. టెక్నిషియన్స్ పరంగా కూడా యూనిట్ భారీగానే కనపడుతుంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంగీతాన్నందిచిన ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్నందిస్తున్నారు. నిరవ్ షా వంటి సినిమాటోగ్రాఫర్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. అలాగే నిర్మాత పి.వి.పి కూడా ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా భారీ లెవల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎంటర్ టైన్ మెంట్ కూడా ఈ చిత్రంలో భారీగా ఉంటుందని చిత్రయూనిట్ పెర్కొంది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్, పోస్టర్స్ కి, ఈరోజు విడుదల చేసిన టీజర్ కి ఆడియెన్స్ నుండి హ్యుజ్ రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్ర ఆడియో విడుదలను నవంబర్ 1న హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో సాయంత్రం 6.30 నిమిషాలకు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు.

అనుష్క, ఆర్య, భరత్, ఊర్వశి, సోనాల్ చౌహాన్, ప్రకాష్ రాజ్ తదితరలు ప్రధాన తారాగణంగా నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: యం.యం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: నిరవ్ షా, ఆర్ట్: ఆనంద్ సాయి, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, కాస్ట్యూమ్స్: ప్రశాంత్, కథ-స్క్రీన్ ప్లే: కణిక థిల్లాన్ కోవెలమూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సందీప్ గుణ్ణం, నిర్మాత: ప్రసాద్ వి.పొట్లూరి, దర్శకత్వం: ప్రకాష్ కోవెలమూడి.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved