pizza
Soggade Chinni Nayana 50 Days in 110 centers
110 కేంద్రాల్లో కింగ్‌ నాగార్జున 'సోగ్గాడే చిన్నినాయనా' అర్ధశతదినోత్సవం
You are at idlebrain.com > news today >
Follow Us

04 March 2016
Hyderaba
d

2016 సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా ప్రేక్షకుల ఆదరాభిమానాలను అందుకొని 53 కోట్లకు పైగా షేర్‌ సాధించి బాక్సాఫీస్‌ని షేక్‌చేసిన కింగ్‌ నాగార్జున లేటెస్ట్‌ బంపర్‌ హిట్‌ 'సోగ్గాడే చిన్నినాయనా' 110 కేంద్రాల్లో దిగ్విజయంగా 50 రోజులు పూర్తిచేసుకుని శతదినోత్సవం వైపు పరుగులు తీస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌లో కింగ్‌ నాగార్జున నిర్మించిన 'సోగ్గాడే చిన్నినాయనా' ద్వారా యువ దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ పరిచయం అయ్యారు. తొలి చిత్రంతోనే సూపర్‌ డూపర్‌ హిట్‌ కొట్టిన ఘనతను 'సోగ్గాడే చిన్నినాయనా' దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ దక్కించుకున్నారు.

అన్నివిధాల సంతృప్తిని కలిగించిన విజయం
'సోగ్గాడే చిన్నినాయనా' ఘన విజయంపై కింగ్‌ నాగార్జున మాట్లాడుతూ - ''సంక్రాంతికి విడుదలై అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణతో 50 రోజులు పూర్తి చేసుకుని ఇంకా విజయవంతంగా ప్రదర్శింపబడుతున్నందుకు చాలా ఆనందంగా వుంది. దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రాన్ని అందరికీ నచ్చేలా తీశాడు. అందుకే ఇంత పెద్ద హిట్‌ అయింది. నా అభిమానులంతా 'సోగ్గాడే' విజయాన్ని చూసి గర్వపడుతున్నారు. వాళ్ల కళ్లల్లో ఆనందాన్ని చూస్తుంటే నాకెంతో ఆనందంగా వుంది. ఈ సినిమాలో నాన్నగారి పంచెల్ని, వాచీని వాడాము. నాన్నగారి ఆశీస్సులు కూడా వున్నందువలనే ఇంత పెద్ద విజయం లభించిందని నా నమ్మకం. 'మనం' తర్వాత నాకు అన్నివిధాల సంతృప్తి కలిగించిన విజయం ఇది. హీరోగా, నిర్మాతగా నాకు చాలా చాలా హ్యాపీ. బంగార్రాజు 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రేక్షకులకు, నాన్నగారి అభిమానులకు, నా అభిమానులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. త్వరలోనే 'సోగ్గాడే చిన్నినాయనా' సీక్వెల్‌ 'బంగార్రాజు' వివరాలు చెప్తాను'' అన్నారు.

దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ మాట్లాడుతూ - ''దర్శకుడుగా నాకు అవకాశం ఇచ్చిన నాగ్‌ సార్‌కి ఈ సందర్భంగా థాంక్స్‌ చెబుతున్నాను. 'సోగ్గాడే చిన్నినాయనా' అన్నపూర్ణ బ్యానర్‌లో చేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. తొలి చిత్రంతోనే నాకు ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. 'సోగ్గాడే చిన్నినాయనా'కి సీక్వెల్‌గా చేస్తున్న 'బంగార్రాజు' స్క్రిప్ట్‌ రెడీ అవుతోంది'' అన్నారు.

సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌ మాట్లాడుతూ - ''అన్నపూర్ణ బ్యానర్‌లో 'మనం'లాంటి గొప్ప సినిమా తర్వాత మళ్లీ 'సోగ్గాడే చిన్నినాయనా'లాంటి గొప్ప విజయం లభించినందుకు చాలా ఆనందంగా వుంది'' అన్నారు.

కింగ్‌ నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి, నాజర్‌, డా|| బ్రహ్మానందం, సంపత్‌, నాగబాబు, సప్తగిరి, పోసాని కృష్ణమురళి, హంసానందిని, యాంకర్‌ అనసూయ, దీక్షా పంత్‌, బెనర్జీ, సురేఖావాణి, దువ్వాసి మోహన్‌, రామరాజు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: పి.రామ్మోహన్‌, స్క్రీన్‌ప్లే: సత్యానంద్‌, సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.వినోద్‌, సిద్ధార్థ్‌ రామస్వామి, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, నిర్మాత: అక్కినేని నాగార్జున, మాటలు-దర్శకత్వం: కళ్యాణ్‌కృష్ణ కురసాల.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved