pizza
Spyder gets U/A, film release on 27 September
సూపర్‌స్టార్‌ మహేష్‌ 'స్పైడర్‌' సెన్సార్‌ పూర్తి - సెప్టెంబర్‌ 27 విడుదల
You are at idlebrain.com > news today >
Follow Us

18 September 2017
Hyderabad

సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం 'స్పెడర్‌'. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని సింగిల్‌ కట్‌ లేకుండా యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని దసరా కానుగా సెప్టెంబర్‌ 27న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. హేరిస్‌ జయరాజ్‌ సారధ్యంలో రూపొందిన ఈ ఆడియో ఇటీవల విడుదలై సూపర్‌ సక్సెస్‌ అయింది. సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ ఫస్ట్‌ కాంబినేషన్‌లో రూపొందిన 'స్పైడర్‌' ట్రైలర్‌కు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ వస్తోంది. దీంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను అందుకునే స్థాయిలో టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో, భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం సూపర్‌స్టార్‌ మహేష్‌ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్‌ హిట్‌ అవుతుందన్న కాన్ఫిడెన్స్‌తో వున్నారు దర్శకనిర్మాతలు.

సూపర్‌స్టార్‌ మహేష్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ఎస్‌.జె.సూర్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హేరిస్‌ జయరాజ్‌, సినిమాటోగ్రఫీ: సంతోష్‌ శివన్‌ ఎఎస్‌సి.ఐఎస్‌సి, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రూపిన్‌ సుచక్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్‌, సమర్పణ: ఠాగూర్‌ మధు, నిర్మాత: ఎన్‌.వి.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్‌.మురుగదాస్‌.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved