pizza
Spyder music launch in Chennai on 9 September, pre-release function in Hyderabad on 15 September
సెప్టెంబర్‌ 9న చెన్నైలో సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ల 'స్పైడర్‌' ఆడియో
సెప్టెంబర్‌ 15న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌
You are at idlebrain.com > news today >
Follow Us

7 September 2017
Hyderabad

సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం 'స్పెడర్‌'. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. కాగా, ఈ చిత్రం ఆడియోను సెప్టెంబర్‌ 9న చెన్నైలో చాలా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. అలాగే సెప్టెంబర్‌ 15న ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ను హైదరాబాద్‌లో భారీ ఎత్తున విడుదల చేస్తారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్‌ 27న దసరా కానుకగా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సూపర్‌స్టార్‌ మహేష్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ఎస్‌.జె.సూర్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హేరిస్‌ జయరాజ్‌, సినిమాటోగ్రఫీ: సంతోష్‌ శివన్‌ ఎఎస్‌సి.ఐఎస్‌సి, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రూపిన్‌ సుచక్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్‌, సమర్పణ: ఠాగూర్‌ మధు, నిర్మాత: ఎన్‌.వి.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్‌.మురుగదాస్‌.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved