pizza
Sri Satya Sai Baba Second schedule completed
`శ్రీ స‌త్య‌సాయి బాబా` 2వ షెడ్యూల్ పూర్తి
You are at idlebrain.com > news today >
Follow Us

23 October 2016
Hyderaba
d

సౌభాగ్య చిత్ర ప‌తాకంపై తెర‌కెక్కుతున్న చిత్రం `శ్రీ స‌త్య‌సాయి బాబా`. `అమ్మోరు`, `అరుంధ‌తి`, `దేవుళ్లు` వంటి విజువ‌ల్ వండ‌ర్స్‌ని అందించిన కోడి రామ‌కృష్ణ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. `దేవుళ్లు` నిర్మాత‌ క‌రాటం రాంబాబు నిర్మిస్తున్నారు. పుట్ట‌ప‌ర్తి స‌త్య‌సాయి బాబాపై తెర‌కెక్కిస్తున్న సేవా ధృక్ప‌థ‌ భ‌క్తి చిత్ర‌మిది. మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా స్వ‌రాల్ని అందిస్తున్నారు. జొన్న‌విత్తుల రామ‌లింగేశ్వ‌ర‌రావు సింగిల్ కార్డ్‌లో 14 పాట‌లకు సాహిత్యం అందించ‌డం విశేషం. ఇటీవ‌లే మొద‌టి షెడ్యూల్ పూర్త‌యింది. అక్టోబ‌ర్ 14 నుంచి 2వ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ అల్లూమినియం ఫ్యాక్ట‌రీ, సార‌థి స్టూడియోస్‌లో వేసిన భారీ సెట్స్‌లో తెర‌కెక్కించారు. తాజా షెడ్యూల్ పూర్త‌యింది. ఈ షెడ్యూల్లో ప్ర‌ధాన పాత్ర‌ధారుల‌పై కీల‌క స‌న్నివేశాలు తెర‌కెక్కించారు.

స‌త్య‌సాయిగా మ‌ల‌యాళ న‌టుడు శ్రీ‌జిత్ విజ‌య్ న‌టిస్తున్నారు. స‌త్య‌సాయికి మాతృమూర్తి గా జ‌య‌ప్ర‌ద‌, తండ్రి పాత్ర‌లో శ‌ర‌త్‌బాబు న‌టిస్తున్నారు. ఉల‌గ‌నాయ‌గ‌న్ క‌మ‌ల్‌హాస‌న్‌కి మేక‌ప్‌మేన్‌గా ప‌నిచేసిన ర‌మేష్ మెహంతి ఈ చిత్రానికి ప‌ని చేస్తున్నారు. ఇటీవ‌లే పాట‌ల రికార్డింగ్ పూర్త‌యింది. ఎస్‌.పి.బాల‌సుబ్ర‌మ‌ణ్యం, వందేమాత‌రం శ్రీ‌నివాస్‌, హ‌రిహ‌ర‌న్‌, బాల ముర‌ళి కృష్ణ‌, చిత్ర‌, హ‌రిచ‌ర‌ణ్‌, విజ‌య్ ప్ర‌కాష్‌, క‌వితా కృష్ణ‌మూర్తి, కైలాస్ గురి, సుఖ్వింద‌ర్ సింగ్, మ‌ల్లాడి బ్ర‌ద‌ర్స్‌, ఆండ్రియా, టిప్పు త‌దిత‌రులు గానాలాప‌న చేశారు. ప్ర‌ఖ్యాత ఛాయాగ్రాహ‌కుడు బి.వాసు ఈ చిత్రానికి ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తున్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved