దసరా కానుకగా అభిమానుల కోసం ‘డిక్టేటర్’ లుక్ విడుదల
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ సంయుక్తంగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘డిక్టేటర్’. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 99వ చిత్రంగా కనుక ఈ చిత్రాన్ని దర్శక, నిర్మాతలు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. వినాయక చవితి సందర్భంగా విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను అభిమానుల నుండి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు దసరా కానుకగా ఈ సినిమాకు సంబంధించిన మరో లుక్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ప్రతి ఏడాది బాలకృష్ణ నటించిన చిత్రంలో ఏదో ఒక లుక్ ను విడుదల చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఇదే ఆనవాయితీని ఈ ఏడాది కూడా కంటిన్యూ చేస్తూ నందమూరి బాలకృష్ణ తన అభిమానులకు, ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలను తెలియజేస్తూ సంతకం చేసిన లుక్ ను విడుదల చేశారు. ఈ చిత్రంలో అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష హీరోయిన్స్ గా నటిస్తున్నారు.