pizza
Sudheer Babu announces ₹2 lakhs to fight coronavirus
క‌రోనా పై పోరాటానికి యంగ్ హీరో సుధీర్ బాబు 2 ల‌క్ష‌ల విరాళం
You are at idlebrain.com > news today >
Follow Us

27 March 2020
Hyderabad

The entire world is suffering from the Corona pandemic. India has announced countrywide lockdown for 21 days. Young Hero Sudheerbabu has stepped up in these testing times to give his support to the governments fighting the coronavirus outbreak. Sudheer babu has announced his contribution of Rs 1 Lakh to Andhra Pradesh CM relief fund and Rs 1 Lakh to Telangana CM relief fund, A total of Rs 2 Lakhs. Apart from his financial contribution towards corona preventive measures taken by government, sudheer babu step forward and given health and fitness tips to his followers. The only way to fight this virus is washing your hands regularly and staying in isolation Sudheer babu said.

 

కరోనా వైరస్ బాధితుల సహాయార్థం అలానే క‌రోనా నివార‌ణ‌కు కేంద్ర - రాష్ట్ర ప్ర‌భుత్వాలు తీసుకుంటున్న నివార‌ణ చ‌ర్య‌ల‌కు త‌మ వంతుగా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరుగా భారీ విరాళాలు అందిస్తున్నారు. కరోనా పై పోరాటానికి ప్ర‌ముఖ హీరో సుధీర్ బాబు కూడా ముందుకొచ్చారు. 2 ల‌క్ష‌ల రూపాయ‌లు విర‌ళాన్ని ప్ర‌క‌టించారు. ఈ మొత్తంలో ల‌క్ష రూపాయ‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి స‌హా నిధికి మ‌రో లక్ష రూపాయ‌లు తెలంగాణ ముఖ్య‌మంత్రి రిలీఫ్ ఫండ్ కి అందించ‌నున్నారు. దేశ ప్ర‌ధాని పిలుపు మేర‌కు 21 రోజులు లాక్ డౌన్ కి త‌న సంపుర్ణ మ‌ద్ధ‌త్తు తెలిపిన సుధీర్ బాబు, ఇంటి ద‌గ్గ‌ర ఉంటూనే ఫిట‌నెస్ ని మెయింటైన్ చేయాలో వీడియోలు చేసి విడుద‌ల చేశారు. అలానే త‌న అభిమానుల‌కు, ప్ర‌జ‌ల‌కు హెల్తీ టిప్స్ ఇస్తున్నారు సుధీర్ బాబు. ఈ సంద‌ర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ ఇలాంటి విప‌త్క‌ర పరిస్థిత్తుల్ని సైతం లెక్క చేయ‌కుండా మ‌న‌కోసం ప‌ని చేస్తున్న ఎందరో డాక్ట‌ర్స్, పోలీస్ అధికారులు, మున్సిప‌ల్ అధికారులు త‌దిత‌రుల‌కు కృతజ్ఞ‌తలు తెలుపుతున్నాను. ఈ మ‌హ‌మ్మారిని ఎదుర్కోవాలంటే బ‌య‌ట‌కు రాకుండా ఇంటిలో ఉండ‌ట‌మే అన్ని విధాల సురిక్ష‌తం. ఇలాంటి భ‌యంక‌ర‌మైన వ్యాధి నివార‌ణ‌కు ప్ర‌భుత్వం తీసుకుంటున్న నివార‌ణ చ‌ర్య‌కు మ‌నంద‌రం స‌హ‌క‌రించాల‌ని త‌న అభిమానుల‌కు, తెలుగు రాష్ట్ర ప్ర‌జ‌లకు విజ్ఞప్తి చేశారు సుధీర్ బాబు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved