pizza
Sudheer Babu about Shamanthakamani
క్యారెక్ట‌ర్ ఎగ్జ‌యిట్‌మెంట్‌గా అనిపిస్తే తెలుగులో విలన్‌గా అయినా నటిస్తాను - సుధీర్‌బాబు
You are at idlebrain.com > news today >
Follow Us

08 July 2017
Hyderabad

నారారోహిత్‌, సుధీర్‌బాబు, సందీప్‌కిషన్‌, ఆది హీరోలుగా నటించిన చిత్రం 'శమంతక మణి'. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకుడు. వి.ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మాత. ఈ సినిమా జులై 14న విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో సుధీర్‌బాబు మీడియాతో సినిమా గురించిన సంగతులను తెలియజేశారు. సుధీర్‌బాబు మాట్లాడుతూ..మంచి సినిమాలనే నిర్ణయించుకున్నాను. అందుకని కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. నా తొలి చిత్రం 'ఎస్‌.ఎం.ఎస్‌' తర్వాత 'ప్రేమకథా చిత్రమ్‌' సినిమా రావడానికి ఏడాదిన్నర సమయం పట్టింది. ఇప్పుడు భాగి, 'భలేమంచి రోజు' సినిమాలు తర్వాత చేసిన సినిమా ఇది. కొన్ని సినిమాలు ఆడియెన్స్‌తో పాటు మనకు కూడా నచ్చి, బావుంటుందని చేస్తాం. అలాంటి వాటిలో 'శమంతకమణి' ఒకటి. ఈ సినిమాలో తల్లి లేని యువకుడి పాత్రలో నటించాను. ఇది యాక్షన్‌ సినిమా కాదు. నా పాత్ర కామెడి చేయకున్నా, నా పాత్ర చుట్టు ఉండే పాత్రల వల్ల కామెడి పుడుతుంది. ఈ సినిమాలో నేను చేసిన పాత్ర నా నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే మా అమ్మ చిన్న వయసులో ఉండగానే మా అమ్మమ్మగారు చనిపోయారు. మా అమ్మగారేమో తల్లి ప్రేమ ఏంటనేది తెలియకుండా పెరిగారట. మా అమ్మగారు నన్నెంతో గారాబంగా పెంచారు. మా అమ్మ నన్నెంత బాగా పెంచారనే ఆలోచించాను. కానీ మా అమ్మ ఎంత ప్రేమగా పెరిగిందనే ఆలోచనే రాలేదు. ఈ సినిమాలో నేను చేసిన పాత్ర వల్ల నేను అది ఫీల్‌ అయ్యాను. మా అమ్మను నాకే పరిచయం చేసిన క్యారెక్టర్‌ ఇందులో చేశాను. ఓ నిజ ఘటనను ఆధారంగా చేసుకుని కథను తయారు చేశాడు దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య. ఇదొక థ్రిల్లర్‌. డిఫరెంట్‌గా నడుస్తుంది. ఎమోషనల్‌ పార్ట్‌ నా వైపు నుండి నడుస్తుంటుంది. ఇందులో ప్రతి పాత్రకు సమాన ప్రాధాన్యత ఉంది.

Sudheer Babu interview gallery

నాలుగు క్యారెక్టర్స్‌లో నేను ఏ పాత్ర చేయాలనేదాన్ని దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్యనే నిర్ణయించారు. నేను వేరే మల్టీస్టారర్‌ విన్నాను కానీ నన్ను ఎగ్జయిట్‌ చేసే కథల్లా నాకు అనిపించలేదు కాబట్టి వద్దన్నాను. అలాగే ఈ కథను వినేటప్పుడు కూడా వద్దని చెబుదామనే విన్నాను. కానీ విన్న తర్వాత చేయలేనని చెప్పలేకపోయాను. విలన్‌ అయినా, హీరోగా అయినా ఓకే ఎఫర్ట్‌ పెట్టాలి. మనం పెట్టే ఎఫర్ట్‌ మన పాత్రను బట్టి ఉంటుంది. కాబట్టి నేను విలన్‌గా కూడా చేయడానికి ఇష్టపడ్డాను. తెలుగులో నన్ను ఎగ్జయిట్‌ చేసే పాత్రలు వస్తే విలన్‌గా అయినా నటిస్తాను. అలాగే మహేష్‌ సినిమాలో కూడా నటించడానికి నేను సిద్ధమే. శ్రీరామ్‌ ఆదిత్య చాలా టాలెంటెడ్‌. దర్శకత్వంలో ఏ అనుభవం లేకుండా నాతో 'భలేమంచిరోజు' అనే సినిమా చేశాడు. అదే నమ్మకంతోనే హీరోలందరూ ఈ సినిమా చేశారు. సక్సెస్‌లో కూడా తన తప్పులేంటో వెతుక్కుంటూ ఉంటాడు దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య. భవిష్యత్‌లో తెలుగు సినిమా గర్వపడే సినిమాలు చేస్తాడని అనుకుంటున్నాను. 'శమంతకమణి' హీరోల గురించి రాసుకున్న కథ కాదు. కథ రాసుకున్న తర్వాత హీరోలు వచ్చి ఇందులో జాయిన్‌ అయ్యారు. నారా రోహిత్‌తో కలిసి 'వీరభోగ వసంతరాయులు', విరించి వర్మ అసిస్టెంట్‌ రాజా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. అలాగే గోపీచంద్‌గారి బయోపిక్‌లో నటిస్తున్నాను. ఈ బయోపిక్‌లో నటించడానికి ఏడెనిమిది కిలోలు తగ్గాలి. ఇప్పటి మూడు కిలోలు తగ్గాను అని తెలియజేశారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved