22 February 2022
Hyderabad
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని దర్శకులు కోరుకుంటారు. కలలు కంటారు. అలా కల కన్న దర్శకుల్లో క్రియేటివ్ జీనియస్ సుకుమార్ ఒకరు. ఆయన కల త్వరలోనే నిజం కాబోతుంది. మెగాస్టార్ చిరంజీవిని సుకుమార్ డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మెగాస్టార్ చిరంజీవిని సుకుమార్ కలిశారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక సమాచారం వెలువడనుంది.
రీసెంట్‌గానే ఐకాన్ స్టార్‌తో పుష్ప వంటి పాన్ ఇండియా సినిమాను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు సుక్కు. అంతకు ముందు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌తో రంగస్థలం వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌ను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మెగాస్టార్‌ను చిరంజీవి సుకుమార్ డైరెక్ట్ చేయబోతున్నారు.