pizza
సుకుమార్ అన్న తనయుడు అశోక్ హీరోగా సెకండ్ ఇండిపెండెన్స్ టాకీస్ బ్యానర్ సినిమా షూటింగ్ పూర్తి...
You are at idlebrain.com > news today >
Follow Us

24 May 2015
Hyderabad

ప్రముఖ దర్శకుడు సుకుమార్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ఆర్య’ నుండి నేటి ‘నేనొక్కడినే’ వరకు ఎన్నో డిఫరెంట్ సినిమాలను మనకు అందించారు. సుకుమార్ అన్న తనయుడు అశోక్ హీరోగా పరిచయం అవుతున్నారు. గతంలో ‘100% లవ్’, ‘నేనొక్కడినే’ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అశోక్ సెకండ్ ఇండిపెండెన్స్ టాకీస్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం అశోక్ డ్యాన్స్, ఫైట్స్ వంటి అంశాల్లో ట్రైనింగ్ తీసుకున్నారు. డిఫరెంట్స్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం సాయిరామ్ చల్లా దర్శకత్వంలో ప్రభాకర్ రెడ్డి నిర్మాతగా రూపొందుతోంది. తాజాగా ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తుంది.

 


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved