pizza
Sumanth's next film!
సుమంత్ కొత్త సినిమా!
You are at idlebrain.com > news today >
Follow Us

30 May 2019
Hyderabad

Sumanth's next film!

Sumanth's next film is going to be produced by prominent character actor/producer DS Rao, who earlier bank rolled hits with Nani, Nikhil, and Nithin. Debutant Santhosh Kumar is the writer/director of this action drama, which will be made under Sanjana Productions and Sai Krishna Productions. P. Jagan Mohan Rao and DS Rao are the producers. Simrat is cast as the heroine for the project. Sumanth will be seen in a completely new shade/get up in this feature. Songs are by Yajamanya, and cinematography is by Ashkar.

"People are never born good or evil, but are purely a victim of their surrounding circumstances" is the crux of this film, says the director. The shoot will begin this coming June. The remaining cast and crew are to be announced shortly.

సుమంత్ కొత్త సినిమా!

నితిన్, నాని, నిఖిల్ తదితర హీరోలతో పలు హిట్ చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత డి.ఎస్.రావు తన మిత్రుడు పి.జగన్ మోహన్ రావుతో కలిసి ప్రముఖ కథానాయకుడు సుమంత్ తో ఓ భారీ చిత్రం మొదలు పెడుతున్నారు.

యువ ప్రతిభాశాలి సంతోష్ కుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ యాక్షన్ డ్రామా ను సంజన ప్రొడక్షన్స్-సాయి కృష్ణా ప్రొడక్షన్స్ పతాకలపై పి.జగన్ మోహన్ రావు-డి.ఎస్.రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సుమంత్ సరసన సిమ్రత్ నటించే ఈ చిత్రం త్వరలోనే సెట్స్ కు వెళ్లనుంది. సుమంత్ ను కొత్త కోణంలో, సరికొత్త గెటప్ తో చూపించే ఈ చిత్రానికి సంగీతం: యాజమాన్య, సినిమాటోగ్రఫీ: అష్కర్.

"ఈ ప్రపంచంలో ఎవరూ చెడ్డ కాదు. ఎవరూ మంచి కాదు. పరిస్థితుల ప్రభావంతోనే మంచివాళ్లుగా, చెడ్డవాళ్లుగా మారతారు" అనే సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని ఈ చిత్రం రూపొందనుందని దర్శకుడు సంతోష్ కుమార్ తెలిపారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తామని సంజన ప్రొడక్షన్స్ అధినేత పి.జగన్ మోహన్ రావు అన్నారు.

 



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved