అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అవసరాల శ్రీనివాస్ హీరోగా వినూత్న కథతో నిర్మించిన చిత్రం `బాబు బాగా బిజీ`. బాలీవుడ్ హిట్ చిత్రం `హంటర్` చిత్రానికి తెలుగు రీమేక్ ఇది. నవీన్ మేడారం దర్శకుడిగా పరిచయమౌతున్న ఈ చిత్రంలో మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోల, శ్రీ ముఖి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మే 5న ఈ చిత్రాన్ని విడుదలైంది. ఈ సినిమాలో చంద్రిక పాత్రలో మెప్పించిన సుప్రియ ఐసోల పాత్ర సినిమా గురించిన విశేషాలను తెలియజేసింది...
సుప్రియ ఐసోల మాట్లాడుతూ - ```నేను హైదరాబాద్ థియేటర్ ఆర్టిస్ట్‌ని. నా తొలి చిత్రం సశేషం. ఇప్పటికీ కూడా నాటకాల్లో నటిస్తుంటాను. సశేషం డైరెక్టర్ శ్రీకిషోర్ దర్శకత్వంలో భూ చిత్రంలో నటించాను. బాబు బాగా బిజీ` సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇలాంటి కాన్సెప్ట్ మూవీని ప్రేక్షకులు సినిమాను బాగా రిసీస్ చేసుకున్నారు. నేను థియేటర్ ఆర్టిస్ట్‌ని ఒకే టైప్ రోల్స్ చేయడం కంటే డిఫరెంట్స్ చేయడానికే ఇష్టపడతాను. నటిగా విలక్షణ పాత్రలు చేయాలి. నేను హంటర్ సినిమా చూడలేదు. నేను వర్క్ చేసిన టీం కానీ, అక్కడి సెట్‌లో వాతావరణం కానీ డిఫరెంట్‌గా ఉంది. నటీనటులు, టెక్నిషియన్స్ అందరూ కొత్తగా ఉన్నప్పుడు కొత్తగానే చేయగలుగుతాం. మాతృకను చూసి కాపీ కొట్టలేం. నా తరపున నేనేం కొత్తగా చేయగలుతామనే దానిపై దర్శకుడు ఫోకస్ పెట్టమని అన్నారు. బోల్డ్ కంటెంట్‌ను మంచి సెన్స్‌లోకి తీసుకొచ్చి దర్శకుడు నవీన్ మేడారంగారు చక్కగా ప్రెజంట్ చేశారు. అవసరాల శ్రీనివాస్‌గారు మంచి కోస్టార్. తన స్టయిల్ మేనరిజమ్స్‌తో పాత్రకు కొత్తదనాన్ని తీసుకొచ్చారు. మంచి సెన్సాఫ్ హ్యుమర్ ఉంది. ఇలాంటి కాన్సెప్ట్‌ను చేయడానికి ముందుకు వచ్చి చేసినందుకు ఆయనకు అభినందనలు. ఇలాంటి పాత్ర చేయడానికి ధైర్యం కావాలి. నేను స్క్రిప్ట్, డైరెక్టర్ విజన్, క్యారెక్టర్ ఎలా పొట్రేట్ చేస్తున్నారని చూసి దాన్ని బట్టే నా పాత్రలను ఎంచుకుంటాను. బోల్డ్‌గా ఉందనే నా పాత్ర చేయలేదు, క్యారెక్టర్ డిజైన్ నచ్చడంతోనే చేశాను. మైమ్ షోస్ చేస్తున్నాను. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటున్నాను`` అన్నారు.