pizza
15న ‘సూర్య వర్సెస్ సూర్య’ పాటలు!
You are at idlebrain.com > news today >
Follow Us

12 February 2015
Hyderabad

‘ఆ యువకుడు సూర్య తేజస్సును ఏ మాత్రం తట్టుకోలేడు. పగటిపూట బయట కాలుపెట్టాలంటే భయంతో వణికిపోతాడు. కేవలం రాత్రిళ్లు మాత్రమే సంచరిస్తుంటాడు. ఇక సూర్య కాంతిని తట్టుకోలేని ఈ యువకుడి పేరు కూడా సూర్య కావడం మరో విశేషం. ఇంతకి సూర్యుడితో సూర్యకు వున్న సంబంధమేమిటి? ఇలాంటి ఓ యువకుడు అమ్మాయి ప్రేమలో పడితే అతడి జీవిత ప్రయాణం ఎలా సాగింది?’ అనేది మా చిత్ర ఇతివృత్తం’ అన్నారు దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని. ఆయన దర్శకత్వంలో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తిచేసుకుంది.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘సూర్యుడి కాంతిని తట్టుకోలేని పార్ఫీనియా అనే అరుదైన వ్యాధితో బాధపడే ఓ యువకుడు తన జీవిత లక్ష్యాన్ని ఎలా సాధించాడు? అనే ఆసక్తికరమైన కథాంశతో రూపొందుతున్న చిత్రమిది. వినోదంతో పాటు కమర్షియల్ అంశాలు మేళవించి ప్రయోగాత్మకంగా తెరకెక్కించాం. తెలుగుప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది’ అన్నారు. ఇటీవలే విడుదల చేసిన టీజర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ ఈనెల 15న ఆదిత్య మ్యూజిక్ చిత్ర గీతాల్ని విడుదల చేస్తున్నాం. ఈ నెలాఖరులో సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని తెలిపారు. త్రిధ నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, మధుబాల, రావు రమేష్, షాయాజీషిండే, తాగుబోతు రమేష్, రాజా రవీంద్ర, ప్రవీణ్, సత్య, సలీమ్‌ఫేక్, అల్లరి సుభాషిణి, వివా హర్ష, జెన్నీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, మాటలు: చందు మొండేటి, ఎడిటింగ్: గౌతమ్ నెరసు, ఆర్ట్: టి.ఎన్‌పసాద్, కొరియోగ్రఫీ: విజయ్, ఫైట్స్: వెంకట్, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీమణి, కృష్ణ చిన్ని, సంగీతం: సత్య మహావీర్, రచన, దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని..

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved