pizza
Swaroop interview
`చంట‌బ్బాయి` క్లాసిక్‌.. అందుకే ట‌చ్ చేయ‌లేదు! -
స్వ‌రూప్‌
You are at idlebrain.com > news today >
Follow Us

16 June 2019
Hyderabad


స్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన చిత్రం `ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ‌`. స్వ‌రూప్ ఆర్‌.ఎస్‌.జె. ద‌ర్శ‌కుడు. న‌వీన్ పొలిశెట్టి హీరో. రాహుల్ యాదవ్ న‌క్కా నిర్మాత‌. ఈ నెల 21న చిత్రం విడుద‌ల కానుంది. ఈ సినిమా గురించి చిత్ర ద‌ర్శ‌కుడు స్వ‌రూప్ ఆర్‌.ఎస్‌.జె. హైద‌రాబాద్‌లో ఆదివారం విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాల స‌మాహారం..

*డిటెక్టివ్ మూవీస్ తెలుగులో చాలా త‌క్కువ వ‌చ్చాయి. 30 ఏళ్ల క్రితం `చంట‌బ్బాయి` వ‌చ్చింది. ఆ త‌ర్వాత ఆ స్థాయి చిత్రం రాలేదు. అందుకే నేను ఆ సినిమాను ఎంపిక చేసుకున్నా.

* నేను పుట్టింది నెల్లూరులో. చ‌దివింది శ్రీహ‌రికోట‌, తిరుప‌తిలో. ఇంజ‌నీరింగ్ అయ్యాక హైద‌రాబాద్, బెంగుళూరులో ఉద్యోగం చేశా. అక్క‌డి నుంచి యు.ఎస్‌.కి వెళ్లా.ఏడాది ఉన్నా. 2017లో మ‌ళ్లీ ఇండియా వ‌చ్చేశా. అప్ప‌టి నుంచీ ఫిల్మ్ మేకింగ్ గురించే ఆలోచ‌న‌.

* కొన్ని షార్ట్ ఫిల్మ్స్, యాడ్స్ (ఫ్లిప్ కార్ట్) చేశా. అంతేగానీ ఎవ‌రి ద‌గ్గ‌రా అసిస్టెంట్‌గా ప‌నిచేయ‌లేదు.

* మ‌న ద‌గ్గ‌ర స్పై సినిమాలు ఓ మోతాదుగా వ‌చ్చాయి. కానీ డిటెక్టివ్ సినిమాలు పెద్ద‌గా రాలేదు.

* విశాల్ ఇటీవ‌ల త‌మిళ్‌లో చేశారు. ప్రాప‌ర్‌గా తెలుగులో చేద్దామ‌ని చేశా.

* నేను ఫేస్‌బుక్‌లో న‌వీన్‌కి ప‌రిచ‌య‌మ‌య్యా. ఈ సినిమాకు కొత్త హీరో కావాలి. పైగా పెర్ఫార్మెన్స్ చేయ‌గ‌ల‌గాలి. అలా అనుకుంటున్న‌ప్పుడు నేను అత‌ని వీడియోలు చూశా. ముంబైలో చేసిన వీడియోలు అత‌నివి చాలా బావున్నాయి. నాకు టైమింగ్ న‌చ్చింది.

* స్క్రిప్ట్ రాశాక నిర్మాత క‌న్నా ముందు, హీరోని క‌ల‌వాల‌నుకున్నా. అలా న‌వీన్‌ని క‌లిశా. మేమిద్ద‌రం 6-8 నెల‌లు ట్రావెల్ అయ్యాక‌, అప్పుడు నిర్మాత‌ను క‌లిశాం.

* ముంబైలో హానెస్ట్ వెడ్డింగ్‌, పార్టీ సాంగ్ అని ఒక‌టి చేశాడు న‌వీన్‌. చిన్న రోల్ అయినా, చాలా బాగా చేశాడు. అక్క‌డ అత‌నికి క‌నెక్ట్ అయ్యాను నేను.

* . `చంట‌బ్బాయి` నాకు ఇన్‌స్పిరేష‌నే. అందులోలాగే మా సినిమాలోనూ కామెడీ డిటెక్టివ్ హీరో. అంతేగానీ, అంత‌కు మించి ఈ రెండు సినిమాల‌కు పోలిక‌లు ఏవీ ఉండ‌వు. ఎందుకంటే `చంట‌బ్బాయి` క్లాసిక్ సినిమా. దాన్ని ట‌చ్ చేయ‌లేం.

* క‌థ ప‌రంగా రివీల్ చేయ‌లేను. కాక‌పోతే... ఒక టౌన్ బేస్డ్ డిటెక్టివ్‌. అప్ప‌టిదాకా కేసులు రాని అత‌నికి ఒక కేసు వ‌స్తే దాని ప‌ర్య‌వ‌సానం ఏమైంద‌నేది అస‌లు క‌థ‌.

* మా సినిమాకు ముందు `గూఢ‌చారి` అని టైటిల్ పెడ‌దామ‌నుకున్నాం. ఆ టైటిల్‌తో సినిమా వ‌చ్చేయ‌డంతో మేం అది పెట్ట‌లేదు. పైగా తెలుగు పేర్లు ఇంటి పేర్ల‌తో స‌హా లెంగ్తీగా ఉంటాయి క‌దా, అందుకే పెద్ద పేరు పెట్టాం. నా ఫ్రెండ్ వివేక్ ఆత్రేయ‌. ఆత్రేయ‌గారు నెల్లూరు అత‌ను. అందుకే మేం ఆ పేరు పెట్టాం. దానికి త‌గ్గ‌ట్టు సాయి, శ్రీను.. అనే పేర్లు చాలా మందికి ఉంటాయి. అందుకే వాటినీ క‌లిపి పెట్టాం.

* ఈ టైటిల్ పెట్ట‌గానే నేను, హీరో త‌ప్ప ఇంకెవ‌రూ పెద్ద‌గా న‌మ్మ‌లేదు. అందుకే మేం కొన్ని ఫ‌న్నీ వీడియోలు కూడా చేశాం.

* రెండు వారాల క్రితం టెస్ట్ గాఆడియ‌న్స్ కి చూపిద్దాం అని అనుకుని సినిమా ప్రొజెక్ట్ చేశాం. చూసిన వారంద‌రూ చాలా పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యారు.

* ఇంకొక ప్రీమియ‌ర్ షో వేద్దామ‌ని కూడా ఉంది.

* నేను జాబ్ వ‌దిలేసి సినిమా తీయాల‌నుకున్న‌దే ఎంజాయ్ చేయాల‌ని. ప్ర‌తి రోజూ కొత్త టీమ్ తో ఏదో కొత్త చాలెంజ్‌తో చేయాల్సి వ‌చ్చింది. అవ‌న్నీ ఎంజాయ్ చేసి చేశా.

* నేను ఏ సినిమా చేసినా కామెడీ, థ్రిల్ల‌ర్‌, డ్రామా నా స్ట్రెంగ్త్ అని అనుకుంటాను. దాన్ని ఇక‌పై కూడా మిస్ కాను. నా సినిమాను ఆడియ‌న్స్ ఎప్పుడెప్పుడు చూస్తారా? ఎలా రెస్పాండ్ అవుతారా అని ఎగ్జ‌యిటింగ్‌గా ఉంది.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved