pizza
చక్రి మృతికి సంతాపం తెలిపిన తెలంగాణ ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ (TFJA)
You are at idlebrain.com > news today >
Follow Us

15 December 2014
Hyderabad

ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు చక్రి హఠాన్మరణం చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మృతికి తెలంగాణ ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ సంతాపం తెలిపింది. చక్రి హఠాన్మరణం తెలంగాణ ఫిలిం జర్నలిస్టుల్ని తీవ్రంగా కలచివేసింది. తెలంగాణ ఫిలిం జర్నలిస్టులతో ఆయనకున్న అనుబంధం అలాంటిది. మీడియా మిత్రులతో ఆయనకున్న సాన్నిహిత్యం అలాంటిది. అద్భుతమైన బాణీలతో ప్రేక్షకలోకాన్ని అబ్బురపరచిన చక్రి మన మధ్య లేకపోవడం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, సంగీతప్రియులకు, తెలుగు చిత్ర పరిశ్రమకు, ఆభిమానులకు తీరని లోటని ఈ సందర్భంగా తెలంగాణ ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ తమ సంతాపాన్ని తెలియజేసింది.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved