pizza
Zee Studios To Release Kangana Ranaut’s Thalaivii Worldwide On September 10
సెప్టెంబర్ 10న కంగనా రనౌత్ ‘తలైవి’... ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుద‌ల చేస్తున్న జీ స్టూడియోస్‌
You are at idlebrain.com > news today >
Follow Us

23 August 2021
Hyderabad

 

Thalaivii starring Kangana Ranaut is billed as one of the most anticipated films of the year generating immense excitement to witness the journey of legendary actress and politician J Jayalalithaa's life through the various stages. From her struggles in the film world to the rise of her stardom as well as her battle through the political hurdles and ultimately emerging as the fierce leader who changed the shape of Tamil Nadu politics.

Directed by AL Vijay, the film’s trailer presented all the crucial incidents in Jayalalithaa’s life and it got immense response from all the sections. Meanwhile, the makers have announced release date of the film through a poster. Thalaivii will arrive in cinemas on 10th September. The poster shows MGR and Jayalalithaa’s romance in an old classic and also a moment, after MGR entering politics.

Aravind Swamy has played MGR in the movie presented by Vibri Motion pictures, Karma Media Entertainment and Zee Studios in association with Gothic Entertainment and Sprint films.

The film has been produced by Vishnu Vardhan Induri and Shailesh R Singh and Co-produced by Hitesh Thakkar and Thirumal Reddy, with music on T-Series. Thalaivii will release worldwide in Hindi, Tamil and Telugu by Zee Studios.

 

లెజెండ్రీ న‌టి, త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జె.జ‌య‌ల‌లిత.. జీవితంలోని వివిధ ద‌శల్లో త‌న ప్ర‌యాణాన్ని ఎలా కొన‌సాగించారు అనే వివిధ అంశాల‌ను ఆధారంగా చేసుకుని రూపొందిన చిత్రం ‘త‌లైవి’. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రం అనౌన్స్‌మెంట్ రోజు నుంచి అంద‌రిలో భారీ అంచ‌నాల‌ను పెంచుతూ వ‌చ్చింది. ద‌ర్శ‌కుడు ఎ.ఎల్‌.విజ‌య్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా ట్రైల‌ర్.. జ‌య‌ల‌లిత జీవితంలోని జ‌రిగిన కీల‌క‌మైన ప‌రిణామాల‌ను తెలియ‌జేసేదిగా ఉండ‌టంతో, ట్రైల‌ర్‌కు ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఈ క్ర‌మంలో నిర్మాత‌లు సోమ‌వారం రోజున ఈ సినిమా విడుద‌ల తేదిని ప్ర‌క‌టిస్తూ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే ఎం.జి.ఆర్‌, జ‌య‌ల‌లిత క‌లిసి న‌టించిన ఆప్ప‌టి క్లాసిక్ చిత్రంలోని రొమాంటిక్ లుక్‌తో పాటు ఎం.జి.ఆర్ రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించడానికి వెళుతుండ‌టాన్ని గ‌మ‌నించవ‌చ్చు. అర‌వింద స్వామి ‘తలైవి’లో ఎం.జి.ఆర్ పాత్ర‌లో న‌టించారు.

విబ్రి మోష‌న్ పిక్చ‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో క‌ర్మ మీడియా ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, జీ స్టూడియోస్‌, గోతిక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, స్ప్రింట్ ఫిలింస్ ప‌తాకాల‌పై విష్ణు వ‌ర్ధ‌న్ ఇందూరి, శైలేష్ ఆర్‌.సింగ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. హితేశ్ ట‌క్క‌ర్‌, తిరుమ‌ల్ రెడ్డి స‌హ నిర్మాత‌లు. ఈ సినిమా మ్యూజిక్ టి సిరీస్‌లో విడుద‌ల‌వుతుంది. సెప్టెంబ‌ర్ 10న ‘తలైవి’ చిత్రాన్ని జీ స్టూడియోస హిందీ, త‌మిళ్‌, తెలుగు భాష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తుంది.

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved