pizza
Thanu Vachenanta release this month end
సెన్సార్‌ కార్యక్రమాల్లో 'తను.. వచ్చేనంట..'
You are at idlebrain.com > news today >
Follow Us

1 August 2016
Hyderaba
d

తేజ కాకుమాను, రేష్మి గౌతమ్‌, ధన్యబాలకృష్ణన్‌ నటీనటులుగా రూపొందుతున్న చిత్రం 'తను.. వచ్చేనంట'. వెంకట్‌ కాచర్ల దర్శకుడు. అచ్యుత ఆర్ట్స్‌ పతాకంపై చంద్రశేఖర్‌ ఆజాద్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు బుల్లితెర హాట్‌ యాంకర్‌గా అలరించి, నాయికగా విభిన్న పాత్రలతో అలరిస్తున్న రేష్మి ఈ సినిమాతో గాయనిగా కూడా పరిచయం కాబోతుంది. రవిచంద్ర సంగీతం అందించిన ఈ చిత్రంలో రేష్మి, చంటి ఓ ట్రెండీ సాంగ్‌ను ఆలపించారు. రేష్మి పాడిన తొలి పాట ఇది. దీనికి గురించి దర్శకనిర్మాతలు మాట్లాడుతూ ''లవ్‌ స్టోరీలతోపాటు హారర్‌, కామెడీ సినిమాల హవా నడుస్తున్న సమయమిది. కొత్తదనం కోరుకునే ప్రేక్షకుల కోసం వినూత్న ప్రయత్నంగా జోమెడీ జోనర్‌లో ఈ సినిమాను తెరకెక్కించాం. కథ, కథనాలతోపాటు తేజ, రేష్మి పాత్ర సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. ఇందులో పబ్‌లో సాగే ఓ పాటను చంటి, రేష్మి ఆలపించారు. చంటి, శివన్నారాయణ, ఫిష్‌ వెంకట్‌ పాత్రలు ఆద్యంతం వినోదాన్ని పంచుతాయి. ఆర్టిస్ట్‌ల సహకారం బావుంది. చిత్రీకరణ పూర్తయింది. త్వరలో సెన్సార్‌కు వెళ్తుంది. ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్‌, ట్రైలర్‌లకు చక్కని స్పందన వస్తోంది. వచ్చేవారంలో పాటల్ని విడుదల చేసి, నెలాఖరులో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం మా బ్యానర్‌కు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది అని తెలిపారు.

ఈ చిత్రానికి ఆన్ లైన్ ప్రొడ్యూసర్ : బెక్కం రవీందర్, ఆర్ట్ డైరెక్టర్ : సిస్తల శర్మ, ఛాయాగ్రహణం : రాజ్ కుమార్, ఎడిటింగ్ టీం : గ్యారీ B.H., గణేష్ .D, విజువల్ ఎఫెక్ట్స్ : విజయ్, సంగీతం : రవిచంద్ర, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : శశి ప్రీతం, సహ నిర్మాత : P. యశ్వంత్, కథ – నిర్మాత : చంద్రశేఖర్ ఆజాద్ పాటిబండ్ల, క్రియేటివ్ ప్రొడ్యూసర్ : K. రాఘవేంద్ర రెడ్డి, స్క్రీన్ ప్లే – దర్సకత్వం : వెంకట్ కాచర్ల.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved