pizza
Thongi Thongi Choodamaku in regular shooting
రెగ్యులర్ చిత్రీకరణలో తొంగి తొంగి చూడమాకు చందమామ...
You are at idlebrain.com > news today >
Follow Us

24 August 2017
Hyderabad

దిలీప్, శ్రావణి, రాజ్ బాల, అపర్న, బేబీ అక్షర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం తొంగి తొంగి చూడమాకు చందమామ. హరి వల్లభ ఆర్ట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఏఎం రెడ్డి నిర్మాత. గురు రాఘవేంద్ర ఛారిటబుల్ ట్రస్టు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఓ వినూత్న ప్రేమ కథతో దర్శకుడు ఆనంద్ కానుమోలు తొంగి తొంగి చూడమాకు చందమామ సినిమాను రూపొందిస్తున్నారు. బస్ స్టాప్ సాయి, జబర్దస్త్ మహేష్, అప్పారావు, జెమినీ సురేష్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ప్రేమను వ్యక్తీకరించడంతో అన్ని చిత్రాలు ప్రారంభమవుతాయి...అయితే ఈ సినిమాలో లవ్ ప్రపోజల్ చివరి అంశం. హీరో హీరోయిన్లు తమ ప్రేమను వ్యక్తీకరించుకోవడమే చిత్ర క్లైమాక్స్. తొలి షెడ్యూల్ పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్ లో రెండో షెడ్యూల్ చిత్రీకరణకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు ఆనంద్ కానుమోలు చిత్ర ప్రోగ్రెస్ వివరించారు. ఆనంద్ కానుమోలు మాట్లాడుతూ....ఒక కాలనీలో జరిగే ప్రేమ కథ ఇది. ప్రేమ కథా చిత్రాల్లో ఓ వినూత్న ప్రయత్నం చేస్తున్నాం. తమ మధ్య ఉన్నది ఎలాంటి బంధమో తెలియని జంట...చివరివరకు ఒకరికి ఒకరు ఆ అనుభూతిని వ్యక్తీకరించుకోరు. తమ మధ్య ఉన్నది ప్రేమ అనే విషయం చివర్లో తెలుసుకుంటారు. ఈలోపు వాళ్లకు అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. ఈ జంట తమ ప్రేమను పరస్పరం తెలుపుకోవడంతో కథ ముగుస్తుంది. క్లైమాక్స్ లో ప్రేమను చెప్పుకోవడం చిత్రానికి కొత్తదనాన్ని తీసుకొస్తుంది. లవ్ తో పాటు జబర్దస్త్ నటులు మంచి వినోదాన్ని అందిస్తారు. బొబ్బిలి టీపీ కళాశాలలో తొలి షెడ్యూల్ చిత్రీకరణ జరిపాం. సెప్టెంబర్ తొలి వారం నుంచి హైదరాబాద్ లో రెండో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభిస్తాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబర్ లో సినిమాను విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాం. అన్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ - శ్రీనివాస్ విన్నకోట, సంగీతం - హరి గౌర, మాటలు - తిరుమల నాగ్, పాటలు - బాలాజీ, ఆర్ట్ - రమేష్, నిర్మాత - ఏఎం రెడ్డి, కథా స్క్రీన్ ప్లే, దర్శకత్వం - ఆనంద్ కానుమోలు.

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved