pizza
Those incidents in 'Khakee' really happened: Real life Dheeraj confirms
ఫ‌క్తు వాస్త‌వ ఘ‌ట‌న‌ల‌తో `ఖాకి`
You are at idlebrain.com > news today >
Follow Us

21 November 2017
Hyderabad

DGP S.R.Jangid is the man who is the inspiration for Karthi's Dheeraj character in 'Khakee'. He led the team, which nabbed the dacoit gang Bawarias, responsible for many ruthless killings in Tamil Nadu in the late 90s.

Jangid, who watched a special screening of 'Theeran Adhigaram Ondru' (Khakee) recently was all praises for Karthi and director H Vinoth. He said that the director has portrayed the incidents, that took place during their mission to nab the dacoits, exactly in the film.

Jangid said, "The way we kidnapped Pmatwari Dharam Singh, the only educated in the Havelis, the way we nabbed the criminals using finger prints and many of the incidents were portrayed exactly in the film. There was a newly married DSP in our team. Karthi performed like a trained commando and he looks like a real cop. Kudos to the director for his research".

"The way the Havelis attacked us was way more violent than what was shown in the film. As the team's leader I used to travel more than 500 kms. We had faced problems in North as we couldn't speak Hindi. We would cook ourselves as shown in the film. Haveli Gang leader Oma Bawaria died in the jail. Two criminals from the gang were shot by us. Though some of them got bail, they won't dare to come to Tamil Nadu again", added Jangid.

'Khakee' has been running to packed houses and the film is steady at the box-office. Umesh Gupta and Subhash Gupta and Aditya Music Pvt.Ltd produced the film in Telugu.

ఫ‌క్తు వాస్త‌వ ఘ‌ట‌న‌ల‌తో `ఖాకి`

కార్తి, ర‌కుల్ జంటగా న‌టించిన `ఖాకి` చిత్రం వాస్త‌వ ఘ‌ట‌న‌ల‌తో జ‌రిగింద‌నే విష‌యం తెలిసిందే. చాలా సంద‌ర్భాల్లో సినిమాటిక్ లిబ‌ర్టీస్ తీసుకుని ఉంటార‌ని అనుకుంటాం. కానీ నిజ జీవితంలో ఆ టీమ్‌ని లీడ్ చేసిన జాంగిద్ మాట్లాడుతూ తాము చేసిన యాక్ష‌న్ ఎపిసోడ్స్ ని సినిమాలో అలాగే చిత్రీక‌రించార‌ని చెప్పారు. హ‌వేలీల‌లో చ‌దువుకున్న ప‌ట్వారి ధ‌ర‌మ్‌సింగ్‌ని తాము ఎలా కిడ్నాప్ చేశామో, సినిమాలోనూ ఫ‌క్తు అలాగే చేశార‌ని చెప్పారు. కొత్త‌గా పెళ్ల‌యిన ఓ డీఎస్‌పీ త‌మ టీమ్‌లో కూడా ఉన్న విష‌యాన్ని గుర్తు చేసుకున్నారు. కార్తి న‌ట‌న రియ‌ల్ పోలీసులాగా ఉంద‌ని, ట్రైన్డ్ క‌మాండోలాగా చేశార‌నీ అన్నారు. కేవ‌లం ఫింగ‌ర్ ప్రింట్స్ ఆధారంగా నేర‌స్తుల‌ను వెతికిప‌ట్టుకున్న తీరును `ఖాకి` మ‌రోసారి క‌ళ్ల‌కు క‌ట్టింద‌ని అన్నారు. ``సినిమాలో చూపించిన చాలా అంశాలు రియ‌ల్‌గా జ‌రిగిన‌వే. హ‌వేలీలు దాడి చేసిన తీరు ఇంకా హింసాత్మ‌కంగా ఉండేది. సినిమాల్లో దాన్ని కొద్దిగా త‌గ్గించే చూపించారు. టీమ్ లీడ‌ర్‌గా నేను దాదాపు రోజుకు 500 కిలోమీట‌ర్లు ప్ర‌యాణాలు చేసేవాడిని. హ‌వేలీల గ్యాంగ్ లీడ‌ర్ ఓమా వేలూరు జైల్లో చ‌నిపోయారు. మ‌రో ఇద్ద‌రిని షూట్ చేశాం. మిగిలిన వాళ్లు కొంద‌రు బెయిల్‌మీద వెళ్లినా.. ఆ గ్యాంగ్ ఇక త‌మిళ‌నాడు వైపు రాదు. మేం హ‌వేలీల‌ల‌ను ప‌ట్టుకున్నందుకు ఎక్కువ‌గా సంతోషించింది ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌వాళ్లే. హిందీ రాక‌పోవ‌డం వ‌ల్ల ఉత్త‌రాదికి వెళ్లిన‌ప్పుడు చాలా ఇబ్బందులు ప‌డ్డాం. `ఖాకి`లో చూపించిన‌ట్టే మా టీమ్ స‌భ్యులమే వండుకుని తినేవాళ్లం. వినోద్ ఈ క‌థ‌ను తెర‌కెక్కించి చాలా మంచి ప‌నిచేశారు`` అని చెప్పారు. విడుద‌లైన తొలి రోజు నుంచే మంచి అప్లాజ్‌ను, హిట్ టాక్‌ను తెచ్చుకున్న‌ `ఖాకి` చిత్రానికి హెచ్‌.వినోద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆదిత్య మ్యూజిక్ ప్రై. లిమిటెడ్ ప‌తాకంపై ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా తెలుగులో అందించారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved