pizza
Titanic censor completed, gets U/A
You are at idlebrain.com > news today >
Follow Us

30 May 2016
Hyderaba
d

రాజీవ్ సాలూరియామిని భాస్క‌ర్ హీరో హీరోయిన్లుగా చందర్ రావ్ సమర్పణలో క‌న్నా సినీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న  చిత్రం ‘టైటానిక్’. ‘అంత‌ర్వేది టు అమ‌లాపురం’ ట్యాగ్ లైన్. ప్రస్తుతం సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా...

స‌హ నిర్మాత అట్లూరి సురేష్‌బాబు మాట్లాడుతూ ‘’’టైటానిక్’ చిత్రం ఫుల్ ప్యామిలీ కామెడి ఎంటర్‌టైన‌ర్‌. ‘అంత‌ర్వేది నుండి అమ‌లాపురం’ వ‌ర‌కు గోదావ‌రి న‌దిలో టైటానిక్ అనే లాంచీలో జ‌రిగే క‌థే ఇది. పెళ్ళి బృందం కామెడితో సినిమా సరదాగా సాగుతుంది. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఇందులో పెళ్ళి కొడుకుగా న‌టిస్తుంటే ర‌ఘుబాబు విల‌న్‌గా న‌టిస్తున్నాడు. అలాగే జ‌బ‌ర్‌ద‌స్త్ టీంజూనియర్ ఎన్టీఆర్జూనియర్ ఏఎన్నార్జూనియర్ కృష్ణజూనియర్ పవన్ కళ్యాణ్ కామెడి సినిమాకు ప్లస్ అవుతుంది. రాజమండ్రిలో పేరుగాంచిన వశిష్ఠ అనే యాత్ర బోట్ ను టైటానిక్ గా రూపొందించి షూటింగ్ చేశాం. సినిమా అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది. రీసెంట్ గా యాజమాన్య సంగీత సారథ్యంలో విడుదలైన పాటలకు, థియేట్రికల్ ట్రైలర్స్ కు మంచి స్పందన వచ్చింది. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ ను పొందింది. సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు సినిమా ఎంటర్ టైనింగ్ ఉందని యూనిట్ ను అభినందించారు. రాజవంశీ సినిమా చాలా చక్కగా తెరకెక్కించారు’’అన్నారు.

పృథ్వీర‌ఘుబాబుకాదంబ‌రి కిర‌ణ్ త‌దిత‌రులు ఇత‌ర తారాగణం. ఈ చిత్రానికి డ్యాన్స్ః స్వామిరారాపిల్ల జమీందార్ చిత్రాల ఫేమ్ చంద్రకిరణ్ఫైట్స్ః రాం సుంక‌ర‌ఆర్ట్ః ర‌ఘుకుల‌క‌ర్ణి.కెమ్యూజిక్ః వినోద్ యాజ‌మాన్య‌ఎడిట‌ర్ః ఎమ్‌.ఆర్‌.వ‌ర్మ‌డైరెక్ట‌ర్ ఆఫ్ ఫోటోగ్ర‌ఫీః అమర్స‌హా నిర్మాతః అట్లూరి సురేష్ బాబునిర్మాతః కె.శ్రీనివాస‌రావుర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: జి.రాజ‌వంశీ.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved