pizza
Tripura in climax shoot
You are at idlebrain.com > news today >
Follow Us

23 June 2015
Hyderabad

క్లయిమాక్స్ లో 'త్రిపుర'

స్వాతి టైటిల్ రోల్ లో జె.రామాంజనేయులు సమర్పణలో క్రేజీ మీడియా పతాకంపై ఎ. చినబాబు, ఎం. రాజశేఖర్ నిర్మిస్తున్న చిత్రం 'త్రిపుర'. 'గీతాంజలి' ఫేం రాజ కిరణ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది.

ఈ సందర్భంగా చినబాబు మాట్లాడుతూ - "ఈ నెల 15న ఈ చిత్రం క్లయిమ్యాక్స్ చిత్రీకరణ ప్రారంభించాం. నెలాఖరు వరకు జరిగే ఈ షెడ్యూల్ తో రెండు పాటలు మినహా సినిమా పూర్తవుతుంది. వచ్చే నెల మొదటి వారంలో పాటల చిత్రీకరణ మొదలుపెడతాం. ఒకటి స్వాతి ఇంట్రడక్షన్ సాంగ్. ఈ పాటను తమిళనాడులోని కుట్రామ్ లో, మరో పాటను పొల్లాచ్చి, కొడైకెనాల్ లోనూ చిత్రీకరించనున్నాం'' అని చెప్పారు.

చిత్రవిశేషాలు చెబుతూ - "ఇది హారర్ థ్రిల్లర్ మూవీ. స్వాతి అత్యద్భుతంగా నటిస్తోంది. త్రిపుర పాత్రను తను తప్ప ఎవరూ చేయలేరేమో అన్నంతగా నటిస్తోంది. మరో పాత్రను పూజా రామచంద్రన్ చేస్తోంది. తను కూడా బాగా యాక్ట్ చేస్తోంది. రాజ కిరణ్ అద్భుతమైన కథ రాశారు. ఆ కథను అంతే అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. కథ, కథనం, స్వాతి నటన, రాజ కిరణ్ టేకింగ్, ఫైట్ మాస్టర్ విజయన్ సమకూర్చిన యాక్షన్ ఎపిసోడ్స్ ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి. కథ డిమాండ్ మేరకు రాజీపడకుండా ఖర్చు పెట్టి తీస్తున్నాం'' అని తెలిపారు.

దర్శకుడు మాట్లాడుతూ - "బలమైన కథతో ఈ చిత్రం చేస్తున్నాం. త్రిపుర ఏం చేస్తుంది? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఆద్యంతం ఉత్కంఠకు గురి చేసే విధంగా ఈ చిత్రం ఉంటుంది'' అని చెప్పారు.

ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే : కోనవెంకట్, శ్రీనివాస్ వెలిగొండ, మాటలు: రాజా, సినిమాటోగ్రఫీ: రవికుమార్ సానా, ఎడిటింగ్: ఉపేంద్ర, పాటలు: చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, నిర్మాతలు: ఎ.చినబాబు, ఎం. రాజశేఖర్, కథ-దర్శకత్వం: రాజకిరణ్, సమర్పణ: జె.రామాంజనేయులు


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved