pizza
Nani's Tuck Jagadish To Stream On Amazon Prime From Vinayaka Chavithi(Sep 10th 2021)
వినాయ‌క చ‌వితి సంద్భంగా సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్‌లో నేచుర‌ల్ స్టార్ నాని ‘ట‌క్ జ‌గ‌దీష్‌’
You are at idlebrain.com > news today >
Follow Us

27 August 2021
Hyderabad

Tuck Jagadish starring Natural Star Nani is one of the most awaited films in 2021. The successful combination of Nani and Shiva Nirvana after Ninnu Kori is back with the film which is billed to be a wholesome family entertainer with adequate commercial elements.

Due to unfavorable conditions, the film will have direct release on Amazon Prime Video and today the team confirmed Tuck Jagadish will premiere on the streaming platform from Vinayaka Chavithi.

"పండగ కి మన Family తో... మీ #TuckJagadish ," posted Nani who also shared a small dialogue video.

The glimpse shows Nani introducing himself as, "I, Tuck Jagadish, the youngest son of Naidu/Bhudevipuram, am telling you... Let's go."

The makers always wanted to release Tuck Jagadish during festival season and they are releasing it for Vinayaka Chavithi.

S Thaman who is in top form has tuned chartbuster album for the film.

Ritu Varma is the leading lady and Aishwarya Rajesh will be seen in a crucial role. Jagapathi Babu has played Nani’s brother in the movie.

The 26th film of Nani is produced jointly by Sahu Garapati and Harish Peddi under Shine Screens Banner.

Cast: Nani, Ritu Varma, Aishwarya Rajesh, Nasser, jagapathi babu, Rao ramesh, Naresh, Daniel Balaji, Tiruveer, Rohini, Devadarsini, Praveen and others.

Crew:
Written& Directed by: Shiva Nirvana
Producers: Sahu Garapati and Harish Peddi
Music Director: S Thaman
Cinematography: Prasad Murella
Editor: Prawin Pudi
Art: Sahi Suresh
Fights: Venkat
Executive Producer: S.Venkatarathnam (Venkat)
Co-Director: Laxman Musuluri
PRO: Vamshi-Shekar
Publicity Designer: Siva Kiran (Working Title)
Costume Designer: Neeraja Kona

వినాయ‌క చ‌వితి సంద్భంగా సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్‌లో నేచుర‌ల్ స్టార్ నాని ‘ట‌క్ జ‌గ‌దీష్‌’

2021 మోస్ట్ అవెయిటింగ్ సినిమాల్లో నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టించిన ‘ట‌క్ జ‌గ‌దీష్‌’ ఒక‌టి. ‘నిన్నుకోరి’ వంటి సూప‌ర్ హిట్ త‌ర్వాత నాని, డైరెక్ట‌ర్ శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా అన్నీ క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో సినిమా తెర‌కెక్కింది.

కోవిడ్ కారణంగా ఏర్ప‌డిన ప్ర‌తికూల ప‌రిస్థితుల వ‌ల్ల ‘ట‌క్ జ‌గ‌దీష్‌’ చిత్రాన్ని ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌లో డైరెక్ట్‌గా విడుద‌ల చేస్తున్నామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. వినాయ‌క చ‌వితి సందర్భంగా సెప్టెంబర్ 10న ఈ చిత్రం అమెజాన్‌లో విడుద‌ల‌వుతుంది.

‘‘పండగకి మన కుటుంబతో... మీ ‘టక్ జగదీష్’’’ అంటూ ఓ చిన్న డైలాగ్ వీడియోను నాని తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ వీడియో గ్లింప్స్‌లో నాని ‘‘భూదేవీపురం చిన్న కొడుకు, నాయుగార‌బ్బాయి ట‌క్ జ‌దీష్ చెబుతున్నాడు.. మొద‌లెట్టండి’’ అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. నిర్మాతలు ఈ చిత్రాన్ని పండ‌గ సంద‌ర్భంలో విడుద‌ల చేయాల‌ని ముందు నుంచి అనుకుంటున్నారు. వారి అనుకున్న‌ట్లే ‘ట‌క్ జ‌గ‌దీష్‌’ను వినాయ‌క చ‌వితి సందర్భంగా సెప్టెంబర్ 10న విడుద‌ల చేస్తున్నారు. మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ ఈ చిత్రానికి అదిరిపోయే ఆల్బ‌మ్‌ను అందించారు.

రీతూ వ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోది. ఐశ్వ‌ర్యా రాజేశ్ కీల‌క పాత్ర‌లో న‌టించింది. జ‌గ‌ప‌తిబాబు ఈ చిత్రంలో నాని అన్న‌య్య పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. నాని 26వ చిత్రంగా రూపొందిన ‘ట‌క్ జ‌గ‌దీష్‌’ను షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీశ్ పెద్ది నిర్మిస్తున్నారు.

తారాగ‌ణం:
నేచుర‌ల్ స్టార్ నాని, రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్‌, నాజ‌ర్, జ‌గ‌ప‌తి బాబు, రావు ర‌మేష్‌, న‌రేష్‌, డానియ‌ల్ బాలాజీ, తిరువీర్, రోహిణి, దేవ‌ద‌ర్శిని, ప్ర‌వీణ్.

సాంకేతిక బృందం:
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: శివ నిర్వాణ‌
నిర్మాత‌లు: సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది
సంగీతం: ఎస్‌. త‌మ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: ప్ర‌సాద్ మూరెళ్ల‌
ఎడిటింగ్‌: ప్ర‌వీణ్ పూడి
ఆర్ట్‌: సాహి సురేష్‌
ఫైట్స్‌: వెంక‌ట్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ఎస్‌. వెంక‌ట‌ర‌త్నం (వెంక‌ట్‌)
కో- డైరెక్ట‌ర్‌: ల‌క్ష్మ‌ణ్‌ ముసులూరి
క్యాస్టూమ్ డిజైన‌ర్‌: నీర‌జ కోన‌
పీఆర్.ఓ: వ‌ంశీ-శేఖ‌ర్‌

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved