pizza
Upendra 2 audio releasing in this week
You are at idlebrain.com > news today >
Follow Us

05 August 2015
Hyderabad

ఈ వారంలోనే 'ఉపేంద్ర 2' ఆడియో

కన్నడ స్టార్ ఉపేంద్రకు టాలీవుడ్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. 'ఎ', 'రా', 'ఉపేంద్ర' చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్న ఉపేంద్ర ఇటీవల అల్లు అర్జున్ హీరోగా రూపొందిన 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రంలో కీలక పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడాయన మళ్లీ 'ఉపేంద్ర 2' ద్వారా హీరోగా తెలుగు ప్రేక్షకులను అలరించనున్నారు. విశేషం ఏంటంటే... 14 ఏళ్ల క్రితం ఉపేంద్రతో 'రా' చిత్రం నిర్మించి, నిర్మాతగా రంగప్రవేశం చేసిన నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఈ చిత్రాన్ని నిర్మించారు.

కన్నడ, తెలుగు భాషల్లో రూపొందిన ఈ చిత్రం 'ఉపేంద్ర' చిత్రానికి సీక్వెల్. కన్నడ వెర్షన్ కి 'ఉప్పి 2' టైటిల్ ఖరారు చేయగా, తెలుగు వెర్షన్ కి 'ఉపేంద్ర 2' టైటిల్ ని ఖరారు చేసారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు రచయిత కూడా ఉపేంద్రే. 'గాలిపటం' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన క్రిస్టీనా అకీవా ఈ చిత్రంలో ఓ కథానాయికగా నటించింది. పరుల్ యాదవ్ మరో కథానాయిక.

ఈ చిత్రవిశేషాలను నిర్మాత నల్లమలుపు బుజ్జి తెలియజేస్తూ - '' 'ఉపేంద్ర' చిత్రం అప్పట్లో ఓ సంచలనం. ఆ చిత్రంలానే ఈ సీక్వెల్ కూడా ఆద్యంతం ఉత్కంఠకు గురి చేసే విధంగా ఉంటుంది. ఈ వారంలోనే ఆడియోను విడుదల చేసి, ఈ నెలలోనే సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని తెలిపారు.

ఈ చిత్రానికి సమర్పణ - భవ్య, కెమెరా - అశోక్ కశ్యప్, సంగీతం - గురు కిరణ్.

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved