pizza
UV Creations announce a film on Anushka birthday
అనుష్క శెట్టి పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా అనౌన్స్ చేసిన యు.వి.క్రియేషన్స్..
You are at idlebrain.com > news today >
Follow Us

08 November 2021
Hyderabad

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమా అనౌన్స్ చేశారు ప్రతిష్ఠాత్మక యు.వి.క్రియేషన్స్. సాహో, రాధే శ్యామ్ లాంటి భారీ సినిమాలతో దేశవ్యాప్తంగా యు.వి.క్రియేషన్స్ కు అద్భుతమైన క్రేజ్ వచ్చింది. ఇప్పుడు ఈ సంస్థలో అనుష్క శెట్టి హ్యాట్రిక్ సినిమా చేయబోతున్నారు. ఇది అనుష్కకు 48వ సినిమా. ఇప్పటికే ఈ నిర్మాణ సంస్థలో రెండు సినిమాలు చేశారు అనుష్క శెట్టి. 2013లో ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి.. 2018లో లేడీ ఓరియెంటెడ్ భాగమతి సినిమాలను యు.వి.క్రియేషన్స్ నిర్మించారు. ఈ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. భాగమతి సినిమా తెలుగుతో పాటు మిగిలిన భాషల్లోనూ ఒకేసారి విడుదలై అద్భుతమైన విజయం అందుకుంది. ఇందులో తనదైన నటనతో అందరినీ మెప్పించారు అనుష్క శెట్టి. ఇప్పుడు మూడోసారి అనుష్క యు.వి.క్రియేషన్స్ కలిసి సినిమా చేయబోతున్నారు. దర్శకుడు మహేష్ బాబు న్యూ ఇమేజ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. అనుష్క అభిమానులకు ఇది నిజంగా బర్త్ డే సర్ ప్రైజ్. ఏ మాత్రం హడావిడి లేకుండా ఉన్నట్టుండి ఆమె కొత్త సినిమా ను అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో సరికొత్త లుక్ లో కనిపించబోతున్నారు అనుష్క శెట్టి. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. త్వరలోనే దీనిపై దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించనున్నారు. భాగమతి సినిమా తెలుగుతో పాటు సౌతిండియన్ భాషల్లో తెరకెక్కించారు. ఇప్పుడు ఈ సినిమాను కూడా మహేష్ బాబు అన్ని భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఎవరెవరు నటించబోతున్నారు అనే విషయంపై చిత్ర యూనిట్ త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయనున్నారు. నవంబర్ 7న అనుష్క పుట్టినరోజు సంధర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు, శ్రేయోభిలాషులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved